Vijaya Bhaskar Rayavaram
గారు B+ with Bhaskar .అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందులో నేటి అంశం పద్య లహరి. స్వర్గీయ ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యంగారి బహుళ ప్రచారంపొందిన వేర్వేరు సినిమా పాటలలోని నాలుగు పదాలతో (దత్తపది) రామాయణార్థములో ఒక పద్యము, భారతార్థంలో ఒక పద్యము చెప్పమన్నారు. కార్యక్రమంలో భాగంగా సిరాశ్రీ గారు ఒకే పాటలోని నాలుగు పదాలతో ఒక పద్యాన్ని చెప్పారు. వారలా అంటూండగానే నాకూ స్ఫూర్తి కలిగి ఆశువుగా వ్రాసాను. కార్యక్రమం సమయాభావంకాకూడదు కాబట్టి అక్కడ ప్రస్తావించలేదు. ఇక్కడ ప్రకటిస్తున్నాను..
పదాలు : యురేక, సకమికా, నీ ముద్దు, తీరేదాకా
రామాయణార్థం: హనుమ సంజీవనీ పర్వతమును తీసుకు వచ్చిన సమయం ఒక వానర సైనికుని హృదయ స్పందన.
భళిరా ఏమది వాయురేఖ ! గగనవ్యావృత్తమై నౌషధా
ఖిలమై వచ్చె నగమ్ము! పంచకమికన్ కించిత్కృపా వృష్టిమై
చలగంగా మృతులైన వానరులుకున్ సంజీవనీ ముద్దు గా
లిలజీవమ్మిడె ! మారుతీ ! ఋణము తీరేదాక సేవించెదన్ !!
లక్ష్మణుని మూర్చనుండీ ఉధ్ధరించటానికి సుషేణుడు నాలు మొక్కలను తేవయ్యా అంటే సర్వౌషధ సంపన్నమైన సంజీవని పర్వతాన్నే తీసుకొచ్చేశాట్ట హనుమ. ఒక జెట్ ప్లేనో అంతకన్న వేగంగా వెళ్ళగలిగేదో పయనిస్తే మనకు కనిపించేది దాని మార్గమే. అలా హనుమ వెళ్ళి వస్తూంటే సంజీవనీ పర్వతం ఒకటే ఎగిరి వస్తోందా అన్నట్టు కనిపిస్తోందిట దూరం నుండీ... ఎంత కరుణ కాకపోతే రణరంగం (పంచకము) నకు ఆ పర్వతం తేవడం వల్ల, పర్వతం మీద ఉన్న ఔషధముల మీదుగా ఎగిరిన ముద్దు గాలి (పిల్లగాలి) సోకి మృతులైన వానర వీరులు సజీవులైనారట.. ఆంజనేయుని ఋణము తీర్చుకోలేను ఆజన్మాంతమూ అతనిని సేవింతునని ఒక వానరుని భావన !!!
భారతార్థం: కృష్ణలీల సందర్భం - ఒక గోపిక అంతరంగం.
భళిరా నీమురళీ ద్యురేఖ గగనవ్యావృత్తమై చెల్వగో
కుల స్త్రీ మానసమెల్ల పంచకమికన్ ! గో, గోపికా, గోపకుల్
చెలులై రాసవిలాస లీలలను నిల్చేరంట ! నీ ముద్దు మ
ల్లెల మోమెంతని చూచినా తనివితీరేదా? కనా కష్టమే !!
కృష్ణుని వేణుగానం ఒక వెలుగు రేఖయై (ద్యు రేఖ) ఆకాశమంతా సుడులు తిరుగుతూ గోపికల మానసమును ఒక రణరంగం (పంచకము) గా చేస్తున్నది. కృష్ణుడొక్కడే పురుషుడన్నప్పుడు గోవులూ, గోపకులూ, గోపికలూ అన్న బేధం లేకుండా అన్ని ప్రాణులూ రాసలీలా విలాసములో చెలులై నిలిచిపోయారట. ముద్దు మల్లెల మోమును ఎంతచూచినా తనివి తీరేనా? కనా కష్టమే అని గోపిక భావన
Sanath Sripathihttp://www.blogger.com/profile/03060064499011873930noreply@blogger.com1tag:blogger.com,1999:blog-8916909504656525965.post-42678431249446309542014-04-16T13:12:00.000-07:002014-04-16T19:53:47.399-07:00రాముడూ- స్ఫూర్తి - సాధించెనే !
కవిత్వం వికసించడానికి అనువైన పరిస్థితులను పెద్దన్నగారు నిరుపహతి స్థలంబు, రమణీ ప్రియదూతిక మొదలైనవన్నారు గానీ .. నా వరకు నాకు వసంతఋతువు, ఉగాది, వసంత నవరాత్రులు, రామనవమి.. రామనామం వీటిలో ఏ ఒక్కటైనా చాలు కవిత్వమూ, మంచి మంచి ఆలోచనలూ రావడానికి.. అలా వచ్చిన ఒక ఊహే.. ఈ టపా...
నవరాత్రులలో త్యాగరాజ ఘనరాగ పంచ రత్న కృతులు వింటూండగా ఒక సంశయం కలిగింది. తనలో ఏమైనా లోపముందేమో అని బాహ్య ప్రపంచములో ఉన్న మానవులు చేస్తున్న తప్పిదాలను తనకు ఆపాదించుకుని దుడుకుగల నన్నే దొర కొడుకు బ్రోచురా అని.. కీర్తన జేస్తారు త్యాగరాజ స్వామివారు.. ఆ కీర్తనలో బ్రోచేవారెవరురా అని అడగడమే గాని స్వామి వారిని రాముడు కరుణించినట్లు సొల్యూషన్ (ప్రశ్నలకు సమాధానాలు) కనిపించదు.. మూడవదైన సాధించెనే ఓ మనసా కృతి చాలా వింతైనది. నిందా స్తుతిలో ఉన్నట్టు నిర్వచనాలున్నాయి... అసలు ఆ కృతే (సంగీత జ్ఞానం పెద్దగాలేని) నా మట్టి బుఱ్ఱకు చిత్రాతి చిత్రంగా అనిపిస్తుంది.. ఆపై ఒక ఆలోచన/ ఊహ కలిగింది.. దాని అక్షరరూపమే ఈ టపా...
ముందుగా ఈ కృతి సాహిత్యం ఇక్కడ
సాధించెనే ఓ మనసా
ఈ కృతి శ్రావ్యకం ఇక్కడ
అసలు సాధించెనే ఓ మనసా కృతి చాలా వింతైనది. ఒక 100 వరకూ కృతులు గమనించా.. వాటన్నిటికీ భిన్నమీ కృతి
1. అన్ని కృతులలో (ముఖ్యంగా పంచరత్న కృతులలో) చరణానికీ చరణానికీ మధ్య పల్లవో పల్లవిలో మొదటి పాదమో ఇట్లా ఉంటూంటుంది పద్ధతి (సంగీత పరిభాషలో దీనినేదో అంటారు). పల్లవి, అనుపల్లవి ఆపై చరణం ఉన్నాగానీ ఈ కృతి మొత్తంలోనూ చరణానికీ చరణానికీ మధ్య మొదటి చరణం పాదమే ఉంటుంది.. ఎందుకో..
2. అన్ని కృతులకీ భిన్నంగా ఈ కృతిలో చెప్పదలుచుకున్న విషయం అన్యాపదేశం గా ఉంటుంది.. (అర్థం చేసుకున్నవారికి చేసుకున్నంత మహదేవా అన్నట్టు).. ఎందుకో...
3. ముఖ్యంగా మిగిలిన అన్ని కృతులలో త్యాగరాజులవారి నామంతో కూడిన మకుటం చివరి చరణంలో ఉంటూండగా ఈ కృతిలో ఆ మకుటం చివరి రెండు చరణాలలో వస్తుంది .. (మకుటం మొత్తం రెండుసార్లు వచ్చినట్టన్నమాట)... ఎందుకో..
4. నిందాస్తుతి జేసినట్లుంది అనిపించేలా వ్యాఖ్యానాలు జెప్పేవారు పల్లవిని, అక్కడక్కడ అనుపల్లవినీ అన్వయించి రాముడు నన్ను బ్రోవక తన పట్టు సాధించుకుంటున్నాడు అని చెబుతూంటారు... మొత్తం కృతి అంతట్లోనూ సమయానికి తగు మాటలాడెనె అని ఉంటే .. ఆ మాటేమిటో చెప్పకుండా సాధించాడంటూ వ్యాఖ్యానాలు చెబుతారు... ఎందుకో ....
5. మీరే చెప్పండి.. యశోద తనయుడంచు ముదంబునను ముద్దు బెట్ట నవ్వుతూంటే బోధించిన "సన్మార్గ వచనాలు" బొంకు ఎలా అయినట్టు? పోనీ "పరమ భక్త వత్సలుడు సుగుణ పారావారుండా జన్మ మనఘు డీ కలి బాధలు దీర్చు వాడనుచు నే హృదంబుజమున జూచు చుండగా" బొంకు ఏవిధం గా అయినట్టు??
6. ఒకవేళ శ్రీవేంకటేశ సుప్రకాశ చరణం చెప్పి మకుటం చివరి పాదంలో వచ్చింది కాబట్టి ముక్తాయించి ఉంటే (దుడుకుగల కృతి మాదిరిగా సొల్యూషన్లేకుండా) సాధించెనే అనే అర్థంతో కృతిపూర్తయినట్టే ఉండేది (ఊహిస్తె).. అయితే అంతటితో ఆగకుండా "కట్ చేస్తే" అన్నట్టుగా తర్వాతి చరణంలో ప్రతీ పాదంలో పై చరణాలన్నిటికీ భిన్నంగా సొల్యూషన్ ఇస్తున్నట్టు ఉంటుంది...ఎందుకో....
7. అసలు స్టోరీ మొత్తం ఆ చివరి చరణంలో ఉంటుంది
(అ) సద్భక్తుల నడతలిలా ఊంటాయిట. "ఇల్లా" అంటే ఎలా ?? నిందాస్తుతి జేస్తున్నట్టా (పైనంతా ఉన్నదదే కదా మరి ??)
(ఆ). "అమరికగా నా పూజగొనెనే" ట (ఏమిటో ఆ "అమరిక"? పైన ఎక్కడా దాని ఉటంకింపు ఉండదు నిందా స్తుతి తప్ప. ఎట్లా తెలిసేను ఆ అమరిక ఏమిటో..)
(ఇ) ఎటువంటి డౌటులేకుండా సూటిగా చెప్పినవి మూడే వాక్యాలు "అలుగ వద్దన్నాట.. విముఖులతో జేర బోకన్నాట. వెతలు గలిగితే తాళమన్నాట్ట" (తాళుకోవడమే ఆయన చెప్ప దలుచుకున్న సద్భక్తా ??)
(ఈ) దమశమాది సుఖదాయుకుడైన రాముడు చెంతరాకుండానే .. సాధించెనే అని ఉంటుంది...
దుడుకుగల కృతి వ్రాసినతర్వాత సొల్యూషన్ దొరక్క త్యాగరాజులవారు కావేరీ నదీ తీరమున కూర్చుని "నేనట్టాంటోణ్ణి.. ఇట్టాంటోణ్ణి" నా ఈ జన్మకు సరైన దారేది అనిపించిందిట.. తలపులోని చింత దాటినప్పుదు గదా | అలరిదైవంబు ప్రత్యక్షమౌట ! కానీ ఆ చింత దాటాలంటే ఎట్లా? ఇతః పూర్వం ఇటువంటి క్లిష్టపరిస్థితుల్లోనే నారదమౌని వచ్చి స్వరార్ణవమిచ్చి బ్రహ్మ రహస్యమిచ్చారు .. మళ్ళీ అట్లాంటిదే సందర్భం మళ్ళీ వచ్చింది.. ఈ సారి ఇంకొక "సద్గురువు" దారి చూపించారుట. త్యాగరాజులవారు స్వయంగా ఆ దారిని చూశారుట. ఆ దారి వలన దైవం ప్రత్యక్షమౌతారని దెలుసుకున్నారుట.. ఆ దారిని, ఆ సద్గురు మాటలనే ఈ కృతిలో ఉటంకించారు...
చోరుడ గాను రాఘవ ! రసోజ్జ్వల కావ్యము వ్రాయ నీ భువిన్ !
మారుతి గాను త్వత్పద సమాహిత దాస్యము జేయ! నేను కూ
పార నిమగ్న జీవుడ నపారకృపాబ్ధి త్వదీయ పాదపూ
జారిగనౌటనెట్లు? నుపచారములన్ ఘటియించుటెట్లయా! (*)
కరచరణాలు లేక సుమగంధములున్నుపవీత వస్త్రమా
భరణము లాసనాదు లభిమంత్రణ మాచమనంబు లర్ఘ్య మో
గిరములు స్నానపాద్య రసకేసర వీటిక దీప ధూప సం
భరిత ప్రదక్షిణాంజలులు మంగళహారతులెట్లొసంగెదో !! (@)
జలములిచ్చి గజము, చత్రమై భుజగమ్ము
గూడు గట్టి లూత గొలువుజేసె !
ఏమి యొసగలేని స్వామి భక్తుల సంగ
తేమి? వారి మనసు దెలియదేమి?
పత్రపుష్పములను, ఫలతోయములభక్తి
గలిగి యొసగ బ్రీతిగలుగు ననుచు
బోధజేసె! దాని బొంకు జేయకయున్న
నెట్లునన్నుబ్రోచునెవ్వడైన ?
ఉన్నదిచ్చుకొందమన్ననున్ లేదేది
గుండెలోన "భయము గూడు" దక్క
బీరువేమి యొసగు బిసరుహాక్ష ! మదీయ
వెతల నెఱుగలేవొ విమలచరిత?
అంతరంగమందు ఆలోచనలుజేయు
శుక్తిపేశి హృదయ భక్తి జూచి
"వెతలు గల్గుటనున దంతయున్ సత్యమ్ము !
ఓర్వవమ్మ ! అలుగకుండవమ్మ ! (#)
నీదు భయమునిచ్చి నిశ్చింతగా నుండు
మమ్మ ! స్వీకరింతునమ్మ తోడు !
ముదము గల్గజేతు ! మురిపింతు"ననిబల్కె
బెండ్లిలోన పెద్దపీటవేసి !
విమలయశోధరుడరిష
డ్దమనుడు స్మితవక్తృడజుడు దశరథసూనున్
డమితమ్మౌ గృపజూపుచు
నమరికగా నాదు పూజనందెను బెండ్లిన్
ఉడుతకిచ్చెనంట ఉన్నతోన్నతమైన
సుఖము గుహుని జూచె సఖుని రీతి
ముద్దు మీర బెండ్లి ముత్యాల తలబ్రాల
తోటి శుక్తి కిచ్చె మేటి కీర్తి !! (#)
https://www.youtube.com/watch?v=T18E58vOTus
జానకి దోసిట కెంపులు
గానగుపడి రాము మస్తకమ్మున పూలై
శ్రీనీలదేహకాంతులు
గానగుపడు ముత్యమిచ్చుగావుత శుభముల్ !!
శ్రీ రామ నవమి శుభాకాంక్షలతో...
* కూపారము = సముద్రము.
# శుక్తిపేశి, శుక్తి = ముత్తెపుచిప్ప..
@ రసకేసర వీటిక = కప్పుర విడెము
Sanath Sripathihttp://www.blogger.com/profile/03060064499011873930noreply@blogger.com3tag:blogger.com,1999:blog-8916909504656525965.post-954815837970150652013-10-15T21:50:00.001-07:002013-10-15T21:54:22.607-07:00 మధుర స్మృతులు..
చిన్నప్పుడు పెద్దగా అనారోగ్యం చేసింది కూడా లేదు..కానీ ఏపాటి జ్వరం గట్రా వచ్చినా "ఏరా ఎలా ఉంది ఒంట్లో?" ఖంగుమని కంఠం వినిపించటంతోటే అన్ని నెప్పులూ, బాధలూ హుష్కాకి అనే ఫీలింగో ఎమో ... "బావుంది మావయ్య" అని మాత్రమే సమాధనం వచ్చేది ... ఎన్నేళ్ళైనా (9 వ తరగతికి వచ్చేవరకూ)ఇదే వరస... డాక్టరు దగ్గరకి వస్తే మనకి ఎలా ఉందో చెప్పాలన్న ధ్యాస/ ఇంగితం రెండూ లేవు.. వచ్చాం కాబట్టి తగ్గిపోతుంది, కాబట్టి ఇంక వేరే చెప్పక్కర్లెదు అనో, అమ్మా, నాన్న ప్రొద్దున ఒక కార్యక్రమానికి తీసుకెళ్తే అక్కడ కనిపించి/ సాయంత్రం మరోచోటికి వెళ్తే అక్కడ కనిపించేసరికి, మనకి ఎక్కడికెళ్ళినా ఎమైనా పర్వాలేదు, మన డాక్టరు నుండి ఎప్పుడూ దూరం లేము అన్న నిబ్బరమో, అందులోనూ మన మాస్టరుగారి ఇల్లు, సీతక్క తో స్నేహం.. అందరిలో ఆప్యాయంగా దగ్గరకి తీసుకుని ముద్దు చేసే సింగరి వదినతో చనువు కారణమో తెలీదు కానీ మాస్టరుగారి పిల్లలందరిలోకి బుజ్జి మావయ్యతో (డా. వరాహ మిహిరాచార్య) ఒక ప్రత్యేకమైన అనుబంధం...
ఆసలు మాస్టరుగారి ఇంటితో మాకు "సంబంధమే" ఒక ప్రత్యేకం. "ఈ.కే తాతగారు -అక్కయ్యగారు", "అనంత కృష్ణ మావయ్య - తాయారొదిన", "బుజ్జి మావయ్య -సింగరొదిన", "లక్ష్మక్క", "శ్రీనన్నయ్య", "సుదర్శనం అన్నయ్య", "సీతక్క".. ఇవీ మా వరసలు.
బుజ్జి మావయ్య - సింగరొదిన ఏమిట్రా అని సరదాగా అడిగేవారు పున్నయ్య శాస్త్రిగారు.. నాకింత వీజీగా ఉంది ఆయనకెందుకు అంత డౌటొస్తోంది అని నాకు మిలియన్ డాలరు ప్రశ్నగా ఉండేది. అనంత్ పెళ్ళిలో కలిసినప్పుడు మా పిల్లవాడికి పరిచయం చేస్తూ కూడా ఇవే వరసలు చెప్పాం.. వాడిక్కూడా అవే వరసలా అని సత్యనాధం గారు అడిగారు.. "చందమామ" లాగానే "ఈ.కే తాతగారూ, బుజ్జిమావయ్య కూడా" అన్నా..
అక్కకి చేయి ఫ్రాక్చరైనప్పుడు, టైఫాయిడ్ వచ్చి తగ్గినప్పుడు అమ్మ బహుశా బేకరీలో సాల్ట్ బిస్కెట్ట్ (ఉస్మానియా బిస్కెట్టు మాదిరి) కొనితెచ్చేది. తినమంటే తిననంటే "బుజ్జిమావయ్య ఇచ్చిన బిస్కెట్టు" అని నమ్మబలికేది. అదెంత స్ట్రాంగు డొసో... జ్వరం తగ్గాకా కూడా బుజ్జిమావయ్య బిస్కెట్టులిమ్మనమని చెప్పవా అని అడిగేవాళ్ళం....
పిల్లలు దసరా సెలవలు, వేసవి సెలవలు వస్తే వాళ్ళ అమ్మమ్మలింటికి, బామ్మలింటికీ వెళ్తూంటారు.. మాకుమాత్రం ఏ సెలవలొచ్చినా చినముషిడివాడే.. చిన్నతనమంతా అక్కడ మామిడితోపుల్లో ఆడుకోవడంలోనే గడిచిపోయింది.. అనంతకృష్ణ మావయ్య సంస్కృతం క్లాసులూ, శ్రీనన్నయ్య జ్యోతిష్యం క్లాసులూ, అమలాపురం నర్సింహరాజు గారు హోమియో క్లాసులు తీసుకునేవారు.. ప్రొద్దున్న నగర సంకీర్తనతో మొదలై రాత్రి పున్నయ్య శాస్త్రిగారి రామాయణం ప్రవచనంతో ముగిసేది...
బి.హెచ్.ఎం.ఎస్ చదువుకోడానికి హైద్రాబాదు వచ్చి శ్రీ జగన్మోహనరావుగారి ఇంట్లో ఉంటున్నపటినుండి మొదలు ఆ సాన్నిహిత్యం .. రాజమండ్రి లో ఎన్.జీ.వోయస్.హోం లో మందులకి మాస్టరుగారితో రెణ్ణెల్లకొకసారో, నెలకొకసారో (సరిగ్గా గుర్తు లేదు) మెడికల్ టూరుకి వచ్చేవారు.. అప్పడు మరింత బలమై... నరింగ్ హోం లో, చినముషిడివాడలో మందులుతీసుకోవడం, హోమియోక్లాసులతో తో మరింత ధృఢమై పెనవేసుకుంది ఈ అనుబంధం...
మాస్టరుగారి పిల్లలందరికీ మా ఇంటిల్లిపాది అందరిమీదా ఆప్యాయతా ఉన్నా మాకు మాత్రం భయమూ, భక్తీ, చనువూ, అనుబంధమూ అన్నీ బుజ్జిమావయ్య తోనే ఎక్కువ .. అందుకే తాయారొదిన, సింగరొదిన ఆఖరికి అక్కయ్యగారు కూడా అమ్మనీ మమ్మల్నీ ఎప్పుడు అనేవారు .. "మీరు మీ బుజ్జి మామయ్య పార్టినే కదా అని"
తలచుకుంటే ఎన్నో మధుర స్మృతులు...
మావయ్యా !! గంభీరమైన కంఠంతో, కళ్ళల్లో చిరునవ్వుతో మా స్మృతిపథంలో మీరెప్పుడు నిలిచే ఉంటారు..... మాకు స్ఫూర్తినిస్తూనే ఉంటారు.."
Sanath Sripathihttp://www.blogger.com/profile/03060064499011873930noreply@blogger.com1tag:blogger.com,1999:blog-8916909504656525965.post-90181327275976295782013-09-22T13:09:00.000-07:002013-10-15T21:53:00.997-07:00నివాళి...
జీవితంలో మనకు తారసపడే వ్యక్తులు - ఆవసరం కోసం కలుసుకునేవాళ్ళు కొందరైతే, అలవాటు వలన కలుసుకునేవాళ్ళు ఇంకొందరు.. జీవితం లో వీరి ప్రభావం నిజానికి అంతంతమాత్రమే... అయితే వీరికి భిన్నంగా అనుకోకుండానో, అవకాశం వల్లనో, లేకపోతే అదృష్టం కొద్దీనో కలుసుకోగలిగినవాళ్ళు ఇంకొందరుంటరు.. వారందరూ చిరస్మరణీయుల కోవకి చెందుతారు....
అట్లాంటి చిరస్మరణీయులలో ఒకరు ఆర్టిస్ట్ కరుణాకర్ !!
నా రాతలను ప్రభావితం చేసినవారిలో బోయిభీమన్నగారొకరైతే
నా గీతలను ప్రభావితం చేసినవారిలో ఆర్టిస్ట్ కరుణాకర్ ఒకరు...
అదృష్టం కొద్ది ఆయనను మళ్ళీ మళ్ళి కలిసే అవకాశం ఒకానొక అవసరం రూపంలో తటస్థించింది.. నవంబరు 2012 నుండి ఏప్రిల్ 2013 వరకూ దాదాపు నెలకొకసారైనా కలవగలిగేవాణ్ణి..
ఆయన బొమ్మ గురించి కానీ ఆయన వ్యక్తిత్వం గురించి కాని నాకు తెలిసింది అణుమాత్రం.. వేస్తూంటే చూడగలిగే అదృష్టం ఒకట్రెండుసార్లు దక్కింది.. అలాంటి సందర్భంలో ఒకసారి అడిగా.. "మీరు నేర్పిస్తానంటే నేర్చుకునే కళాపిపాసులు, కళా తపస్వులూ కోకొల్లలుంటారు.. మీ కళనందించరూ అని..." ఒప్పుకుంటే శిష్యుణ్ణవ్వాలన్న ప్రగాఢమైన కోర్కెతో...
సిగరెటు పొగ ఊదేస్తూ "టైముండద్దూ.. ఒప్పుకున్నవాటితోనే సమయం చాలడం లేదు, కొత్తవి తలకెత్తుకోవడం కూడానా" అన్నారు..
"మీ గీతలంటే నాకు బహు మక్కువ.. ఆంధ్రభూమి లో సెంటర్ స్ప్రెడ్లూ.. కవర్ పేజీ వెనకనుండే కవితలకు బొమ్మలూఅన్నీ ప్రోగు చేసి పెడుతున్నా.. మా అబ్బాయి కనక చిత్ర రచనమీద ఆసక్తి కలిగి నేర్చుకుంటానంటే వాటినే ఆస్తి ఇచ్చినట్టు ఇస్తాను" అన్నా...
తనను కాక వేరెవరినో ప్రస్తుతిస్తున్నారన్నట్లు నిగర్వంగా..తన కుంచె పనిలో తాను మునిగిపోయారు.
మా అబ్బాయి ఉపనయనం అయ్యాక హడావిడి ప్రయాణం అవడం మూలాన ఆయనను కలిసి ప్రవర చెప్పించి ఆశీస్సులు ఇమ్మనమని అడుగుదామన్న కోరిక నెరవేరనే లేదు..
ఆయన ఎక్కడున్నా తన బొమ్మలతో ఎందరికో స్ఫూర్తినీ, అనుభూతిని అందిస్తూనే ఉంటారు..
జయంతితే సుకృతినో...
Sanath Sripathihttp://www.blogger.com/profile/03060064499011873930noreply@blogger.com3tag:blogger.com,1999:blog-8916909504656525965.post-23353271821534829992013-06-16T08:21:00.000-07:002013-09-22T13:09:56.845-07:00Happy father's day
ఎన్నో విలువలనిచ్చెను
ఎన్నో సద్గుణములిచ్చె ! నెంతటి ప్రేమో
నాన్నకు! మాటలు జెప్పక
నన్నిటినందించె మాకునాచరణమునన్ !
Sanath Sripathihttp://www.blogger.com/profile/03060064499011873930noreply@blogger.com3tag:blogger.com,1999:blog-8916909504656525965.post-77165939963789251862012-07-09T02:10:00.000-07:002012-07-16T01:00:19.225-07:00సింహావలోకనం
సింహావలోకనం, సింహావలోకనం అంటూంటాము.. అసలు తరచి చూసుకోడానికి సింహావలోకనమనే ఎందుకనాలి? జంతువులలో మిగిలిన ఆ జంతువూ వెనక్కి తిరిగి చూసుకోనే చూసుకోదా? చూసుకున్నా సింహానికున్నంత grace వాటికి ఉండదా? ఉత్తమమైన నడకని సూచించేప్పుడు సామజ వరగమనా అనీ, హంస గమనా అన్నారు కదా? సింహానికే ఎందుకంతటి grace ఉంటుందో గమనించారా? కారణమేమయ్యుంటుంది? నాకొచ్చిన చిలిపి ఊహ
శ్రీరంగంలో రంగడి కళ్ళంత అందమైన కళ్ళు చూసినతర్వాత ఒక భక్తాగ్రేసరుడికి ఇంక ఏ కళ్ళల్లోనూ అంతటి అందం లేదనిపించిందిట. అట్లే, వెనక్కి తిరిగి చూస్తే "తిప్పుకోలేనంత అందం" అంటారు కదా అది కనిపించిందట సింహానికి అమ్మవారిలో. అంతే అప్పటినుండీ ఆవిడ మోమును చూసుకుని చూసికుని మురిసి తరించిపోతోందిట సింహం అప్పటినుండే "సింహావలోకనం" ఉత్తమమైన పదప్రయోగమయ్యిందేమో..
మునులే మోమును గాంచినంత గలిగెన్ మోక్షమ్ము ! నెద్దానినిన్
అనిమేషత్వము నొంది జూతురట నింద్రాద్యష్ట దిక్పాలురున్
గనగా నెంచి తలెత్తి జూచితి ! శిరఃకంపమ్ము "సింహావలో
కనమయ్యెన్" నిల సింహవాహిని! శివా! కారుణ్యవారానిధీ !!
Sanath Sripathihttp://www.blogger.com/profile/03060064499011873930noreply@blogger.com1tag:blogger.com,1999:blog-8916909504656525965.post-2313698884374426962012-03-24T23:55:00.000-07:002012-03-24T23:55:16.911-07:00బ్లాగ్ కవులతో సద్గోష్ఠి @ Hyderabad
నందన నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని దివ్య కళాంజలి (మా అపార్ట్ మెంటు) లో సాయంత్రం 5 గం.ల నుండి పద్య కవి సమ్మేళనం ఏర్పాటు గావించబడినది.
శ్రీ చింతా రామకృష్ణారావు గారు "చిత్ర కవిత్వము" పై,
శ్రీ భైరవభట్ల కామేశ్వరరావుగారు " తెలుగు కవుల వాగ్విలాసము" పై ప్రసంగించనున్నారు
ఆసక్తి కలవారందరూ ఆహ్వానితులే
మా ఇంటికి చేరే దారి
Sanath Sripathihttp://www.blogger.com/profile/03060064499011873930noreply@blogger.com0tag:blogger.com,1999:blog-8916909504656525965.post-39473466380980288742012-02-25T08:14:00.001-08:002012-02-25T08:15:49.039-08:00బ్లాగ్వినువీధిలో రవి మార్కు ప్రచండత ఇంకా కనిపించదేం?
మా హైద్రాబాదులో ఎండా కాలం వచ్చేసింది, వసంతం వచ్చేవేళ కూడా అయ్యింది కానీ ఎందుకో ... అయినా ప్రచండుడి పత్తా లేదు..సాహిత్యంలో కవ్వింపులు, చదివింపులూ అవుతున్నా ఎక్కడా సడిలేదు...ఎందుకో ఏమో అంటూ రంగం సినిమా సాంగేసుకున్నా ఆన్సరులేదు. ఎందుకంటారు???
బ్లాగెడివాడు పద్యములు బాగుగ నల్లెడివాడు గౌతముం
డేగినమార్గమెప్డు ప్రకటించెడివాడును "జాల" రాయడున్
గాగలనేర్పువాడు! అనకాపలి, అం.ద్ర.ని మధ్యనన్నిటిన్
బ్లాగెదనన్న భాస్కరుడు బ్లాగగవచ్చెనటమ్మ? జెప్పరే !
మరి అతగాడి టాగ్ లైను అనకాపల్లి నుండి అంతర్జాతీయ ద్రవ్య నిధి వరకూ బ్లాగాడిస్తా (ఆరెండూ దక్క)
బ్లాగాడెద తత్త్వములన్
బ్లాగాడెద శాస్త్ర విషయ భావములన్ నే
బ్లాగిడిస్తానని రవి
మూగాంబిక నోమునొకటి మొదలిడెనేమో?
కనిపింపక వినిపించును
గనుకనె కవి యందురతని ! కవియౌ రవియే
కనిపింపడు మరి రవి గాం
చనిచో కవిగాంచుననెడి సామెతలెట్లౌ
బాబూ రవీ నువ్వెక్కడ ఉన్నా నీకోసం బ్లాగ్బంధువులు (ఉత్ప్రేక్ష) వెయ్యి కళ్ళతో (అతిశయోక్తి) ఎదురుచూస్తున్నారని తెలుపుతూ - సనత్
సోదరుడు రవి ఈ మధ్య కాలంలో హైద్రాబాదు నీళ్ళు బడి, పనిలోబడి, ఒత్తిడికి లోబడి సర్వ దర్శనాలు అవీ రద్దు చేసారట. ఎంతైనా సీమనుండొచ్చాడు కదా.. వాళ్ళ వెంకన్నబాబులాగానే ఓన్లీ వీ.ఐ.పీ దర్శనాలు, బ్రేకు దర్శనాలే తప్ప మరొక్క మాట ఎత్తటం లేదుట.. అందుకే సామాన్య బ్లాగ్జనుల తరఫున వంకన్నకీ రవికీ ఇవే అనేకానేక ఆహ్వానాలు...వేడికోలూ... (సరదాగా)
Sanath Sripathihttp://www.blogger.com/profile/03060064499011873930noreply@blogger.com19tag:blogger.com,1999:blog-8916909504656525965.post-85960199430656009102012-02-20T20:59:00.003-08:002012-02-21T00:14:29.905-08:00బాల శివుడు - కంప్లైంటు
అల్లరిచేసినా, ఆకలేసినా, నిద్ర వచ్చినా, ఆవలించినా, పండగైనా పబ్బమైనా,ఆటల్లో అరటిపండైపోయినా, వేరెవరైనా తొండి చేసినా అన్నింటికీ కావలసింది అమ్మే. చూస్తే అందరూ చాలా అనందంగా ఉన్నారు నాకు మాత్రం ఏ సరదాలూ లేవు..
తడిస్తే జలుబు చేస్తుందనీ...
అన్ని దిక్కులకీ పరిగెడుతూంటే కాళ్ళు నొప్పులొస్తాయని...
వంటికంతా దుమ్మూ ధూళీ పట్టించుకుంటే క్రిములొస్తాయని...
నాకు చెప్పిందెవ్వరు? నన్ను పట్టించుకున్నదెవ్వరు?
నీట్లో నానకు! వంటి పైన మసి గానీకయ్య చిన్నయ్య! చీ
కట్లో నుండకు! అంబరమ్ము విడబోకయ్యంచు దెల్పంగ నా
కిట్లెవ్వారలు లేరటంచు కినుకన్ కించిత్తు చూపింప నే
డిట్లీరీతి పరుండినాడొకొ శివుండీ హైమ శైలమ్మునన్ !!
అవును... మరీ విడ్డూరం కాకపోతే అంత చిన్నపిల్లవాడికి వంటినిండా ఆ విభూది రేఖలేమిటి? అంత మంచులో చిన్నా చితకా బట్టలేమిటి? భయపడిపొయేందుకా అన్నట్టు మెళ్ళో ఆ పాములేమిటి? ఎప్పుడు చూసినా తలారా ఆ స్నానమేమిటి? ఆడుకోడానికి స్నేహితులేరి? మరి పిల్లవాడలిగాడంటే అలగడూ...
నారదాది మునులు నా లీలలని వాని
నెన్నసాగిరయ్య నిజము భస్మ
ధారణమ్మదేమి? ధర్మ భిక్ష మదేమి?
పాము కంఠమందు ప్రాకుటేమి?
అయినా ఎవరు మాత్రం ఏమి చేస్తారు? అందరికన్నా ముందు పుట్టమని అతగాడికెవరు చెప్పినట్టు? చెబితే చెప్పారు గాక. పొలోమని పుట్టెయ్యడమెందుకు ఇప్పుడు అమ్మకోసం ఆ బుంగమూతెందుకు? అయినా దానికీ వెనుకనేదో ఒక దివ్య లీల ఉండే ఉంటుంది...
తల్లి దండ్రి కొఱకు తపియించె గనుకనే
"ధరణి జనుల కేను తండ్రి నౌదు!
లలిత జనని యౌచు లాలించు నని" బల్కి
శివుడు నిలిచె ప్రేమ శిఖర మౌచు
"ఉన్నవాడు" తెలియకుండవచ్చును గాని
"లేనివాని" కెఱుక దాని విలువ
ఏమి లేని వాడు ఇహమందు పరమందు
"అమ్మ"నిచ్చె మనకు నందుచేత
"జగతః పితరౌ" అగుటకు
స్వ గతమ్మే హేతువౌనొ? శర్వా ! మదిలో
చిగురించిన భావమ్మిది
అగణిత గుణ!  ఇదియు నీదు ఆశీః ఫలమే !!
అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు.
(బాల శివుని చిత్రం అంతర్జాలము వారి సౌజన్యంతో )
Sanath Sripathihttp://www.blogger.com/profile/03060064499011873930noreply@blogger.com3tag:blogger.com,1999:blog-8916909504656525965.post-36758234352134762142012-01-29T04:13:00.000-08:002018-03-02T09:08:29.639-08:00రాముడు- స్ఫూర్తి- మాతృ హృదయం
శ్రీ కృష్ణ జననం కథ చదువుకుంటున్నప్పుడు దేవకీ దేవికి సప్తమ గర్భంగా జన్మించిన బలరాముణ్ణి యోగమాయ గోకులానికి చేర్చింది, ఆ తరువాత కృష్ణుడు పుట్టడం, కావలి వాళ్ళందరూ నిద్రపోతూంటే వసుదేవుడు బుట్టలో పెట్టి తీసుకెళ్ళడం, యమున దారినివ్వటం, ఆదిశేషుడు గొడుగుపట్టడం వంటివి చదువుతున్నప్పుడు యోగమాయ అక్కడ పుట్టడమేంటి, మహా విష్ణువు ఇక్కడ పుట్టడమేంటి, వసుదేవుడు అంత రిస్కు చేసి అక్కడి పిల్లనిక్కడ, ఇక్కడి పిల్లవాణ్ణి అక్కడ మార్చడం ఏమిటి? యమున దారినివ్వడమేమిటి? ఎంచక్కా బలరాముడిలా ఆ పుట్టేదేదో అక్కడే పుట్టెయ్యచ్చు కదా, అంతగా అయితే దేవకికీ వసుదేవుడికీ కనిపించి అన్నయ్యలాగానే నేనూ గోకులంలో పుట్టి పెరిగి వస్తాను అని చెప్పవచ్చుకదా అని ఒక ప్రశ్న పుట్టింది (ఊహే కావచ్చుగాక). దాన్లోంచి పుట్టిన సమాధానమే ఇది...
ఎట్టి తపముజేసె నేమొకో కౌసల్య
బాలరాముడాడి బాడువేళ
కాంచ గలిగె నమ్మ ! కైకమ్మ, సౌమిత్రి
తల్లి జూచె నిన్ను దనివి దీర
అదితి పొందగలిగె ననసూయకున్ దక్కె
నమ్మదనములోని కమ్మదనము !
నిన్ను గన్నవారు, నిను గన్నవారలున్
పొందు భాగ్యమేమనందు నేను?
పాము బొందగలిగె ! పక్షిరాజుకు దక్కె!
నమ్మ వంటి భాగ్యమంబుజాక్ష !
నిన్ను నెత్తుకొనగ నెట్టి పుణ్యము చేయ
వలెను దెలుపుమిందు వదన, నేడు !!
ముద్దులొలుకు లేత ముంగురుల్ వర్ణింప
దరమె? బ్రహ్మ నారదాదులకును
అరుదుగాదె జూడ నరచేతి గుప్పెట్లు
మూసి యుంచు లీల మోహనాంగ?
ఆవలించువేళ నాశ్చర్యమనిపించు
బోసినగవు మనసు దోచి నట్లు
కనులు మూసికొనియు కన్నతల్లిని తడుం
గొనెడి శిశువు నెత్తుకొన దలంతు
నీదు చిట్టి కనులు, నీ చిన్ని పాదాలు
ముగ్ధ మైన నీదు మోము గంటి !
నిన్ను కోరుకుంటి ! నిన్నెత్తుకోదలచి,
ఎదురు జూచి, వేచి, వెదురు నైతి !
ఒడిని జేర్చుకొనిన నుప్పుంగు మనసంత
క్రొత్త పుంత లందు కొనునుగాని
తీయనైన కోర్కె తీరదాయెను ! ఇల్లు
గుల్ల యైన గుల్ల పుల్ల నేను !
పత్ర, పుష్పములను, ఫల, తోయములనేమి
ఇవ్వలేను ! తల్లి నవ్వలేను !
వింతగోర్కె యనుచు విదిలించి పోవద్దు
బుట్ట మనసు నొడిసి బట్ట వయ్య !
యనుచు విన్నపముల నర్పించె శ్రీరామ
విభుని జేరి నొక్క వెదురు బుట్ట !
దాని కోర్కె దీర్ప ద్వాపరమ్మున స్వామి
బుట్టగానె వెదురు బుట్టనెక్కె !
అడ్డేది వాని లీలకు?
గొడ్డూ గోదముల కడకు ! గోకులమునకున్
బొడ్డూడని బిడ్డడు జనె
నడ్డంబడి యమునదాటె నాశ్చర్యముగా !!
యోగమాయ గూడి యుక్తితో బలరాము
నంపె వ్రజకు తాను నట్లె బోవ
గలిగి గూడ నెక్కె గంపనొక్కటి జూడ
బుట్ట భాగ్యమింక బొగడ దరమె?
Sanath Sripathihttp://www.blogger.com/profile/03060064499011873930noreply@blogger.com6tag:blogger.com,1999:blog-8916909504656525965.post-29829223377960776122012-01-26T13:11:00.000-08:002012-01-26T20:13:23.238-08:00నవవిధ భక్తి - Pictorial representation
Please find the pictorial representation of Bhaagavata Murthi who demonstrated each aspect of Nine-Fold Devotion (నవవిధ భక్తి)
This was drawn in 2004 as part of Sphurthi- a 2 day Summer Camp for the children of age 7-14. The children were explained each bhakti with the help of story related to the great ones, who stood as the role model, demonstrating that particular aspect of Devotion and importantly what does it means now for us to practice in day-to-day life ...
(1)శ్రవణం --> ఆదిశేషుడు,
(2) కీర్తనం --> అన్నమాచార్యుడు,
(3) విష్ణోః స్మరణం --> నారదుడు,
(4) పాద సేవనం --> హనుమంతుడు,
(5) అర్చనం --> సుదాముడు (కుచేలుడు),
(6) వందనం --> గరుత్మంతుడు,
(7) దాస్యం --> లక్ష్మణుడు,
(8) సఖ్యం --> మైత్రేయుడు,
(9) ఆత్మ నివేదనం --> గోపికలు.
Sanath Sripathihttp://www.blogger.com/profile/03060064499011873930noreply@blogger.com3tag:blogger.com,1999:blog-8916909504656525965.post-62647337808555008452012-01-04T19:33:00.000-08:002012-01-28T02:50:34.252-08:00ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు
మఱ్ఱియాకు పైన మఱులు గొల్పుచు గాలి
వ్రేలు చప్పరింతువేల ? దల్లి
గర్భమందు నీదు గాల్జేతులాడించు
వేళ నొచ్చె నేమో వ్రేలు, గనగ
నీటిమీద దేలు నీకెట్లు దినిపింతు
బువ్వ యనుచు నడుగ నవ్వ సాగె
చీకగానె వ్రేలు నాకలంతయు దీరె
గంగ ఊరెనేమో కాలి నుండి
అన్నమయ్య మిమ్ము నట్లేల కీర్తించె
చిలిపి ఊహ గలుగ దెలిసె నాకు
ఎంగిలయ్యెననుచు నెంచెనేమొకొ బ్రహ్మ
కడుగ సాగె పాద కమలములను
అట్టి పాదయుగ్మమర్చించుకోనిమ్ము
ముక్తి గిక్తి వలదు మోహనాంగ
నీదు పాదయుగళి నిత్యమ్ము సేవించు
వరమునిమ్ము మార్గ శిరమునందు !!
అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు
(బొమ్మలు అంతర్జాలం లో సేకరించినవి)
Sanath Sripathihttp://www.blogger.com/profile/03060064499011873930noreply@blogger.com11tag:blogger.com,1999:blog-8916909504656525965.post-59177166938298791862011-10-29T07:12:00.000-07:002011-10-29T10:44:07.176-07:00రాముడు- స్ఫూర్తి - గ్రహణం
కార్తీక మాసం ఆరంభమయ్యింది, శనివారం కదా అని మా అబ్బాయితో కూర్చుని న్యాసం చేస్తూంటే " వక్త్రే సరస్వతీ తిష్టతు, నయనయోశ్చంద్రా దిత్యౌ తిష్ఠేతాం, సర్వతో వాయుస్థిష్ఠతు" అని వినగానే వాడడిగాడు అంటే ఏమిటి నాన్నా అని (ఆ పేర్లు వాడికి కొంచం పరిచయమున్నవి అవడం తో). సరస్వతీదేవి నాలుక పైన, సూర్య చంద్రులు రెండు కళ్ళలోనూ, వాయువు అంతటా ఉన్నాడని అర్థం నాన్నా అన్నా...(వాడెక్కడ శివుడి తలమీద చంద్రుడుంటాడు కదా మళ్ళీ కళ్ళల్లో ఉండడమేమిటి అని అడిగేలోపు ఇంకేదో విషయం పైకి ధ్యాస మరల్చేశాను).
ఆ తర్వాత అదే విషయమై ఆలోచించటం మొదలెడితే ఒక ఊహ తట్టింది...
రవి యొక కంట వెల్గులిడు రాతిరి ఱేడు మరొక్క కంట నీ
భువి పయి వెల్గులీనునని పుత్రునకున్ వివరించువేళ చ
క్షువులను గీటి ఆడెనొ రఘూత్తముడున్ తన తండ్రి తోడ శై
శవమున! నాటి నుండి రవి చంద్రులకున్ గ్రహణమ్ము లొచ్చెరో !!
స్ఫుర్తి:
(1) నాగమురళి గారి ఆకాశంలో ఆంబోతు, కామేశ్వరరావుగారి దీపావళి చందమామ చదువగా ఊహలటువైపు సాగటం..
(2) మా అబ్బాయికొచ్చినట్టే సందేహాలు రాముడికీ వచ్చి ఉంటాయి, వాళ్ళ నాన్న ఒడిలో కూర్చుని ఆటలాడేటప్పుడు (అసలే ఆయనగారికా అబ్బాయంటే బహు గారాబమాయె) వాళ్ళ నాన్ని అడిగి ఉంటే ఆయన ఏమని సమాధనం చెప్పేవారో కదా అని కలిగిన ఆలోచన. కుడి కన్నుగీటగా సూర్య గ్రహణమూ, ఎడమ కన్నుగీటగా చంద్ర గ్రహణమూ అయ్యాయేమో...
మనసైనవాడు కన్నుగీటితే లభించే "కిక్కు" ను వర్ణించటం అలవిగాదు. అందులోనూ పసిపిల్లల బోసి నవ్వులు, కంటి చూపులూ.. అబ్బో మరింత ముద్దొస్తున్నట్టుంటాయి. ఆ కొంటె కనుచూపుతోనే కద బాలకృష్ణుడు కూడా గోపికలందరి మనసునూ కొల్లగొట్టింది..
కావాలంటే సంపూర్ణ సూర్య గ్రహణమప్పుడు కనిపించే గోల్డెన్ రింగు ను చూడండి...
Sanath Sripathihttp://www.blogger.com/profile/03060064499011873930noreply@blogger.com2tag:blogger.com,1999:blog-8916909504656525965.post-43506370056962776162011-10-18T21:54:00.000-07:002011-10-19T03:32:00.856-07:00కాటుక కంటి నీరు...
బ్లాగ్మిత్రులు కామేశ్వరరావు గారు "తెలుగు పద్యం" లో ఇటీవలి కాలంలో సాహిత్యావలోకనం చేస్తూండగా తనకెదురైన ఒకానొక సంఘటనకి కలత చెంది ఒక చిన్నటపా పెట్టగా దానిలో చర్చ "కాటుక కంటి నీరు" పద్యం మీదకి వెళ్ళడం (అది పోతన గారి రచనా కాదా అనే విషయంలో), నాణేనికి రెండువైపులా సమమైన వాదన ఉండడంతో ఆ చర్చని అంతటితో సమాప్తి చేద్దామన్న ఒడంబడికకి రావటం జరిగింది. ఐతే అదేవిషయమై నిన్ననే ఇంకొక వివరణ చదవటం చేత దానిని అక్కడే చర్చించి మాట తప్పటం కన్నా ఇంకొక టపాగా ప్రకటించవచ్చనే ఉద్దేశంతో ఈ టపా...
ఆసక్తి కలవారు ఇక్కడ ఆ టపా చర్చను చదువవచ్చు.
"కాటుక కంటి నీరు" చాటువుకు ప్రస్తావన శ్రీనాథ కవి సార్వభౌముడు రాజులకు కృతినిచ్చి, ధన సంపాదన చేసి దారిద్ర్యము బాపుకొనమని పోతనకు ప్రబోధము చేసినట్లూ, అప్పుడు ప్రత్యుత్తరముగా పోతన భారతీ దేవితో పలికిన పద్యంగా ఈ పద్యరాజం ప్రశస్తమయ్యింది.
ఐతే నిడదవోలు వేంకటరావుగారు "పోతన" అనే గ్రంథం లో ఈ క్రింది విధంగా వివరణనిచ్చారు
"ఇందు పేర్కొనిన మువ్వురూ (కర్ణాట, కిరాట, కీచకులు) శ్రీనాథునికి సంబంధించినవారే !
కర్ణాట రాజు:- శ్రీనాథుడు కర్ణాట రాజగు ప్రౌఢదేవరాయల ఆస్థానమున, ముత్యాలశాలలో కనకాభిషేక మహా సత్కారమును గాంచినవాడు - కర్ణాట క్షితినాథ మౌక్తిక సభాగారాంతరాకల్పిత స్వర్ణ స్నాన జగత్ప్రసిధ్ద కవిరాట్టు" నని చెప్పుకున్నాడు
కిరాటులు:- కిరాటులనగా వైశ్యులు. శ్రీనాథుడు తన హర విలాస ప్రబంధమును, కాంచీ పురవాసి యగు అవచి దేవయ సెట్టి పుత్రుడగు తిప్పయ శెట్టికి గృతినిచ్చియున్నాడు. చిఱు తొండనంబి ని వర్ణిస్తూ శ్రీనాథుడు "కోటికిన్ పడగనెత్తిన నక్కిరాట వంశ కిరీటాలంకారంబు. 2-34" అని చెప్పి యున్నాడు
కీచకులు:- ఈ పదము వలన శ్రీనాథుడు చెప్పిన పల్నాటి వీర యుధ్ధ కథ సూచితమైనది. పల్నాటి వీరచరిత్ర ప్రశస్త దేశికృతియైనను హీనజాతి వారి కోరిక పైన రచించినదే కదా.
శ్రీనాథుడీవిధముగా మువ్వురవలన వారికి కృతులనిచ్చి గాని, కవితా సమ్మాన రూపమున గాని ధనమునార్జించినట్లుగా, త్రిశుధ్ధిగా తానట్టి పనులు చేయనని భారతి దేవితో విన్నవించాడు"
ఈ పద్యం చాటువు కనుక, అప్పటి దేశకాల రీతులు, జరిగి ఉండవచ్చునన్న కథాంశమూ నిజమే అయితే, ఈ వివరణ దానికి ఊతమిచ్చేదే కనుక అయినట్టైతే అది పోతన రచన కాకపోయుండవచ్చన్నది నా అభిమతం
శారదా పుత్రుడు, బ్రహ్మ దత్త వరప్రసాదుడైన శ్రీనాథుణ్ణి పరోక్షం గా నిరశిస్తూ వాగ్ఞియమాన్ని పాటించే భాగవతోత్తముడైన పోతన పలికి ఉండడన్నది నా భావానికి హేతువు.
Sanath Sripathihttp://www.blogger.com/profile/03060064499011873930noreply@blogger.com9tag:blogger.com,1999:blog-8916909504656525965.post-20948699046939108112011-09-12T11:49:00.000-07:002011-09-14T08:59:06.605-07:00రామాయణ కల్పవృక్షం అర్థం కావాలంటే ఏమేమి కావాలి?
"రామాయణ కల్పవృక్షానికి జ్ఞానపీఠం దక్కిందంటే అది ఒక మహాద్భుత రచన అయిఉండాలి. కనుక అది మనం కూదా చదవాలి" అన్న ఆలోచన తో మొదలయ్యింది ప్రస్థానం. పుస్తకం కొనుక్కుని చదివితే అర్థం అవదా అని ఒకప్పుడనిపించేది. తీరా కొనడానికి ప్రయత్నించేసరికి తెలిసింది అది పుస్తకం కాదని పుస్తకాలు అని. కొంపదీసి తక్కువ అంచనా వేశామా ఏమిటి అనిపించింది.
అదృష్టం కొద్దీ కొన్నేళ్ళు బజార్లో ఆపుస్తకాలు దొరక్కపోవటం వల్ల (లేదా ఎక్కడదొరుకుతాయో నేను సరిగ్గా తెలుసుకోకపోవటం వల్ల) కొంచం సమయాభావం అవ్వటం, ఆలోపు అక్కడక్కడ వ్యాసాల్లో, రచనల్లో రామాయణ కల్పవృక్ష ప్రస్తావన రావటం, నా అజ్ఞానం కొద్దిగా తగ్గి, ఆ కావ్యం పట్ల కించిత్ గౌరవ భావం పెరగటం, శ్రధ్ధ కలిగిన తర్వాత వెదకగా కోటీ లో ఒకానొక షాపులో బాలకాండం ఒక్కటీ దొరికిటం తో మలి అడుగు పడింది అనుకున్నా.
తీరా పుస్తకం కొన్నాకా నా పరిస్థితి "అనుకున్నదొకటి, అయ్యింది ఒకటి" అన్న చందంగా తయారయ్యింది. అప్పటికి నాకింకా పద్యాల పేరున పైత్యం రాయడం కలలో కూడా వచ్చి ఉండదు. మొత్తానికి ఏమైతేనే భాగవతం లో పద్యాలని చదువుకున్నాం కదా అట్లానే ఇదీ చదివేద్దాం. అర్థం అయిపోతుంది అనుకుంటూ మొదలెట్టా... గ్రీకు లాటిన్ అంటే ఏమిటో అనుభవ పూర్వకంగా తెలిసొచ్చింది. ఆదెబ్బకి రెండువిషయాలు అర్థం అయ్యాయి (అనిపించింది). ఒకటి -విశ్వనాథను పాషాణపాక ప్రభువనెందుకన్నారో. రెండు - కల్పవృక్షం చదువుదామన్న క్రేజే గానీ చదవటానికి, అర్థం చేసుకోటానికి నాకు అంత పరిపక్వత లేదని. ఆదెబ్బకి పుస్తకం మూసేసి అటకెక్కించేశా. విశ్వనాథ నవలలు తీశా.. బహు బాగా అర్థం అవసాగాయి. దాంతో ఒకటి తేల్చేసుకున్నా. పద్యాలు మనకబ్బవురా అబ్బయి అని. ఇది జరిగి దాదాపు పదహారేళ్ళు దాటి ఉంటుంది.
ఇంటర్లో సంస్కృతమయ్యాక మళ్ళీ ఎట్లా ఏర్పడిందో రుచి తెలియదు గానీ పద్యాలు కొంచం కొంచం అర్ధం అవసాగాయి. దాంతో అటకమీదనుంచీ తీసి మళ్ళీ కొన్ని పదుల పద్యాలు చదివా. పోతనగారి ఎఫెక్టో, మన బుర్ర కెపాసిటీనో గానీ భారతం లో పద్యాలు గానీ, కల్పవృక్షం పద్యాలు గానీ అంతగా అర్థం కాలేదు. కాకపోతే ధారుణి రాజ్య సంపద మొదలైన పద్యాలు రాగాలాపనలో బాగున్నాయని కొన్నింటిని కంఠస్థ పట్టి కాలీజీలో కొంచం ఫోజు కొట్టా. అంతటితోనే సరి. మళ్ళీ పుస్తకాలు యథాస్థానం ప్రవేసించాయి. శొభనార్థే క్షేమాయ పునరాగమనాయచ అని కూడా అన్నా.. ఈ సారి.
అన్నట్టుగానే నాన్నగారితో అవధానాలకి వెళ్ళటం, సరదాగా ఉందనిపించటంతో పుస్తకాన్ని మళ్ళీ తీశా. ఈ సారీ అదే రిజల్టు. వయసు పెరిగినకొద్దీ అవగాహన కలిగి అర్థం అయిపోతుంది అని భావించానేగానీ అంతకుమించి సాధన ఏమీ చేయలేదు. ఇక దీనికీ మనకీ రామ్రాం అనుకున్నా. కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్యులవారి గోదావైభవ కావ్యాన్ని, దాని రహస్యప్రకాశాన్ని చదివా. అద్భుతం అనిపించింది. ఇన్నాళ్ళుగా నేనెటువంటి అనుభూతికోసం ఎదురుచూస్తున్నానో అది దక్కింది అనిపించి. ఒక మూడేళ్ళు ఆపుస్తకాన్ని ఆసాంతం చదువుకుని ఆనందించాక బోయి భీమన్న గారిని అనుకోకుండా చదవటం నా పయనంలో ఒక అనుకోని మలుపు.
భద్రాచల యాత్ర రాముడి ఆత్మీయతని పరిచయం చేస్తే అసంకల్పిత ప్రతీకార చర్యగా భావాలు ఒక పద్యం లాంటి వాటితో రావడం ఇంకొక మజిలీ. తోచింది రాసి అబ్బో అని సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చుకుంటున్నప్పుడు బ్లాగన్నదై పరిచయమవ్వడం. అప్పటిదాక నూతిలో కప్పమాదిరి ఉన్నవాణ్ణి ప్రపంచాన్ని తెలుసుకోవడం మరొకమజిలీ...దాని పర్యవసానం కొంచం వ్యాకరణం, చందస్సు నేర్చుకుని చదివితే రమాయణ కల్పవృక్షం అర్థం అవుతుందేమో అని కొంచం ఇంగితం కలగటం..ఆ దిశగా ప్రయత్నం చేయటం.....
కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతాడన్నట్టు ఏ జన్మ లో చేసుకున్న పున్నెమో మంచిపద్యం లో వడలి మందేస్వర రావుగారి గురించి తెలుసుకోవడం, ఆపై "ఇదీ కల్పవృక్షాన్ని ఆస్వాదించగలగటం" అటుపై మొన్నీమధ్య విశ్వనాథ పుస్తకాలని కొనడానికి వెళితే నా కష్టాన్ని గమనించి విశ్వనాథ వారే కరుణించారన్నట్టుగా "కల్పవృక్ష రహస్యములు" పుస్తకం దొరికింది.
తన కావ్యానికి తానే వ్యాఖ్యాన్నందిచారని తెలిసిన మరుక్షణం నా ఆనందనికి అవధులు లేవు. నన్ను కరుణించటానికే అని నేననటానికి గల కారణం విశ్వనాథ వారు ఒక్క బాలకాండకు మాత్రమే వ్యాఖ్యానన్నందిచారు. (దురదృష్టవశాత్తు మిగిలిన కాణ్డలకు వారి వ్యాఖ్యానం లేదు).
కల్పవృక్షమెందుకు అంతటి బృహత్తర రచనో తనమాటల్లో తానే వ్యక్తపరిచారు. ఎంతో అరుదైన భాష్యాన్నందిచారు. ఆ మహాకావ్యానికి వెనుకనున్న ఆలోచన, హృదయమూ, రచనా శిల్పం, అలంకారాలూ, నానుడులూ, విశేషాలూ, రహస్యాలూ తనంత తానుగా ఆవిష్కరించారు. ఆశ్చయకరమైన విషయమేమిటంటే ఇటువంటి పుస్తకం లిస్టులో అమ్మకానికి ఉందని విశాలాంధ్రవారు చెప్పలేదు, విశ్వనాథ మనవళ్ళవద్దనున్న కేటలాగ్ లో కూడా ప్రస్తావనలేదు, కానీ విమర్శ గ్రంథాల సెట్టు కొంటే దాన్లో ఈ పుస్తకాన్ని ఉచితంగా అందిస్తున్నారు (పాత పుస్తకం మాదిరిగా ఉంటుంది. స్టాక్ క్లియరెన్సులో భాగంగానో ఎమో).
విశ్వనాథ విమర్శ గ్రంథాల సెట్టు కొనుక్కోవడం నాకే తెలియకుండా నాకునేను చెసుకున్న గొప్ప సాహయమేమో అని అనిపించింది..
చదివావా అంటే చదివాననిపించుకోవటానికేముంది? ఒక్క బిగిన చదివేయచ్చు కానీ కల్పవృక్షం అర్థమవ్వాలంటే చందస్సు, వ్యాకర్ణము, నిఘంటువు వంటివి ఉంటే సరిపోదు, తెలుగు తెలియాలి, తెలుగుదనం తెలియాలి, తెలుగు సంస్కృతి తెలియాలి, ఆ తీయని మకరందాన్ని ఆస్వాదించే విధానం కూడా తెలియాలి అప్పుడే దాని హృదయం ఆవిష్కృతమౌతుంది అన్న నిజం నిఖార్సుగా తెలిసొచ్చింది. అసలైన తెలివొచ్చింది. మనసు నిండింది.
ఆల్రెడీ "ఇదీ కల్పవృక్షం" చదివినవారికి ఈ పుస్తకం ఇంకోక దర్పణం. విశ్వనాథని తెలుసుకోడానికి. పుస్తకంలోని మధురానుభూతులు..... మచ్చుక్కి కొన్ని [వారి వ్యాఖ్య నీలం రంగులో]
(1) పుత్రకామేష్టి సందర్భంగా అగ్నిదేవుడు రాజుచేతిలోపాయసము పెట్టే సందర్భములో వారి వ్యాఖ్యానము
ముదిపృదాకువు సెజ్జమునులు జోదిళ్ళీయ
హాళిమై గూర్కు సుమాళి యొకడు
ప్రామింకు చిట్టచివళ్ళలో నసురుల
దోరించునట్టి కటారి యొకడు
ప్రామఱ్ఱి క్రీనీడ బాఠమ్ము ముసలులౌ
మునులచే జదివించు పోఱడొకడు
పాలవెల్లి కరళ్ళపై వెలికింతలై
కాలివ్రేల్చీకెడు కందొకండు
పసిమియై గాలికిని రాలిపడిన యొక్క
నలుసు నివ్వరిముల్లైన వెలుగొకండు
స్థూలమై వచ్చి వచ్చి తా సూక్ష్మమగుచు
జనపతి కరస్థమగు పాయసమున జొచ్చె
(అ) పృదాకువు - సర్పము. ముది పృదాకువు - ఆదిశేషువు
జోదిళ్ళు- నమస్కారములు
ఆదిశేషువనే సయ్యపై మునులు నంస్కరించుచుండగా నిద్రపోవునొక యొయ్యారి. ఇతడు విరాణ్మూర్తి
(ఆ) ప్రామినుకు - వేదములు
ప్రామిన్కు చిట్తచివళ్ళు - వేదాంతములు. అక్కడ రాక్షసులను సమ్హరించు ఖడ్గధారి.
విరాణ్మూర్తికన్న ఈ ఖడ్గధారి తక్కువరూపముకలవాడు
(ఇ)ప్రాత మఱ్ఱి చెట్టుకింద వృధ్ధులౌ ఋషులచేత పాఠమ్ములను వల్లెవేయించీ పోఱడు- బాలుడు. ఇతని మూర్తి మరియు చిన్నది
(ఈ)పాలవెల్లి కరళ్ళపై క్షీరసముద్ర తరంగములమీద తన కాలి వ్రేలు చీకెడి కందు-పసివాడు.
(ఉ) మరల వరిముల్లంతవాడు
విరాట్స్వరూపంతో మొదలెట్టి తగ్గుతూ తగ్గుతూ వచ్చి రాజు చేతిలో పాయసంలో ప్రవేశించాడు. అంతటి స్వామి ఇంతగా అయ్యాడని అర్థం. పరమేశ్వరుడు అణోరణీయాన్, మహతోమహీయాన్ కద"
చెప్పదలుచుకున్న విషయాన్ని సాపేక్షికంగా, పథకం ప్రకారంగా (planned గా అని నా ఉద్దేశం).. భావప్రసక్తి చేయటం, పద్య రచన దానిని పరిపుష్ఠిచేయటం అందులోనూ "జోదిళ్ళు", "ప్రామిన్కు చిట్టచివళ్ళు", "పోఱడు (తెలంగాణ యాస కూడానేమో)", కాలి వ్రేల్చీకెడు కందు" వంటి తెలుగు పదాల పోహళింపు మామూలుగా చదివేసుకుంటూ పోతే వాటి అందం సొబగూ, అర్థం ఔతాయా?
(2) రామయణంలో రామ జననమయ్యక ఒక పద్యముంటుంది. దానిని కనీసం ఒక 10 సర్లైనా చదివి ఉంటా. ప్రత్యేకంగా ఏమీ అర్థం కాక ముందుకి వెళ్ళిపోయా కుడా....
వెలికి గొనిపోకుడీ బిడ్డబిట్టలారు
సంజవేళల నంచు గౌసల్య పలుక
గరుడి వైకుంఠమున భయకంపితుండు
మడమలను ద్రొక్కుకొను ఱెక్క ముడుచుకొనుచు
దానికి వ్యాఖ్యానాన్నందిస్తూ "ఈ భాగమంతయూ తెలుగుల ఇండ్లలో పురుళ్ళు, పిల్లలు పెరుగుటలు వారినాడించుటలు, ఆ మహాశోభ ఉన్నది. వట్టి కావ్యకఠిన బుధ్ధులకుతెలియదు. అంతయు రసభరితముగానుండును. ఆ రసము జీవితమందున్నది. తెలుగుగృహములలోనున్నది. ఇచ్చటకవిచేసినది పద్యములు వ్రాయుట మాత్రమే. తెలుగు దేసములో నేడాదిదాటని పిల్లలను సాయంకాలమందు నారుబయతకు దీసుకొనిపోనీయరు. పిట్టలారునందురు. పూర్వము పసిపిల్లలకదియొక జబ్బువచ్చెడిది. అట్లు రామచంద్రుని గూర్చి ఎవ్వలైన ననగా గరుత్మంతుడు భయముతో తన ఱెక్కలను ముడుచుకొనెడివాడట" అన్నారు.
ఇలా ఎన్నెన్నో ఆణిముత్యాలను, చందో విశేషాలను, చారిత్రక రాజనీతి రహస్యాలను, తెలుగువారి ఆచార వ్యవహారాలను ప్రతిపాదిస్తూ తానుచేసిన బృహత్కావ్యానుగత హృదయాన్ని విహంగవీక్షణంగావిస్తారు విశ్వనాథ.
పద్యరచనపై, అందునా కల్పవృక్షంపై మక్కువగలవారి ఇంట నీరాజనాలందుకోగల మేటి పుస్తకమీ "కల్పవృక్ష రహస్యములు". విశ్వనాథవారి జయంతిని పురస్కరించుకుని వారికి కృతజ్ఞతగా నా ఈ టప...
Sanath Sripathihttp://www.blogger.com/profile/03060064499011873930noreply@blogger.com10tag:blogger.com,1999:blog-8916909504656525965.post-60502389683305313812011-08-16T07:17:00.000-07:002011-08-16T07:17:59.038-07:00విశ్వనాథ సమగ్ర సాహిత్య గ్రంథావళి
వాక్కులో, వాక్యంలో, శబ్దంలో, సమాసంలో, భావంలో, భావనంలో, దర్శనంలో, విమర్శనంలో, భాషణంలో, భూషణంలో ఒక వైలక్ష్యం వెల్లివిరిసేట్టు గా రచించిన మహా కవి 20 వ శతాబ్దములోని ఆంధ్ర సాహిత్యమునకు, ప్రత్యేకించి సంప్రదాయ సాహిత్యమునకు పెద్ద దిక్కు; "కవి సమ్రాట్" బిరుదాంకితుడు, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత - శ్రీ విశ్వనాథ సత్యనారాయణ.
ఆయన చేపట్టని సాహిత్య ప్రక్రియ లేదు.- కావ్యములు, కవితలు, నవలలు, నాటకములు, ప్రయోగములు, విమర్శలు, వ్యాసములు, కథలు, చరిత్రలు - ఆయన పాండిత్యము, ప్రతిభలు జగమెరిగినవి. ఆయన మాటలలోనే "నేను వ్రాసిన పద్యముల సంఖ్య , ప్రకటింప బడినవాని సంఖ్య, సుమారు ఇరువది వేలుండ వచ్చును. నేను చింపివేసినవి ఏబది వేలుండవచ్చును " . ఆయన రాసిన రచనలన్నీ కలిపితే లక్షపుటలుండవచ్చును అటువంటి విశ్వనాథ వారి సమగ్ర సాహిత్య గ్రంథావళిని విశ్వనాథ వారి మనుమడు, విశ్వనాథ పావని శాస్త్రి గారి అబ్బాయి - విశ్వనాథ సత్యనారాయణ (బహుశా జూనియర్ అనాలేమో) పునర్ముద్రణ గావించారు.
మంచి కాగితం పై మంచి ముద్రణతో పుస్తాకాలు అందుబాటులోకి వచ్చాయి.
(1) నవలలు - 57 పుస్తకాలు --> 4500/-
(2) నాటకములు - 16 పుస్తకాలు --> 666/-
(3) విమర్శ గ్రంథాలు - 11 పుస్తకాలు --> 1116/-
(4) పద్యకావ్యాలు (రామాయణ కల్పవృక్షం తో కలిపి) --> 1500/-
(5) పాటలు, ఇతరములు (కిన్నెరసాని పాటలు మొ||) --> 500/-
వెరసి మొత్తం 118 పుస్తకాలు 8282/- రూపాయలు.
డిస్కౌంటు పోనూ 7500/-
కవిసామ్రాట్ విశ్వనాథవారి అమూల్యమైన 118 పుస్తకములను కేవలం 7500/- రూపాయలకు కొనుగోలు చేసుకుని ఇంటినీ, మన తెలుగు అభిరుచినీ, సాహిత్య పిపాసనూ కూడా పరి పుష్టి చేసుకోవచ్చును.
ప్రతులకు : జూనియర్ వి.స.నా. ఫోన్ నంబర్ : 9246100751 (లేదా) నవోదయ పబ్లిషర్స్ : 9247471362
....ఆలస్యం అమృతం విషం ....
త్వర పడండి
Sanath Sripathihttp://www.blogger.com/profile/03060064499011873930noreply@blogger.com4tag:blogger.com,1999:blog-8916909504656525965.post-47989523163322663132011-08-01T00:24:00.000-07:002011-08-01T00:34:29.272-07:00రాముడూ - స్ఫూర్తి -2 (కొనసాగింపు)
(భావం పన్నెండేళ్ళ క్రితం భద్రాచల యాత్రలో కల్గినా ఇన్నాళ్ళకు మళ్ళీ భద్రాచలయాత్ర అయినపిదప పద్యరూపం ధరించింది. అందుకే దీని శీర్షిక రాముడూ - స్ఫూర్తి -2 (కొనసాగింపు) అని ఇచ్చాను. )
రాముడు అడవి లో పయనిస్తూంటే ఒక సంఘటన జరిగిందిట. అది ఇరు ప్రాణుల సంభాషణ. అందులోనూ తల్లీ పిల్లల మనో భాషణం , అదీ రాముడితో.
" పిల్లలు అమాయకులు. పసితనం వీడి పోలేదు. రాముడు గనక స్వీకరించక పక్కన పెట్టేస్తే మిగిలిన వారితో పోల్చుకుని తామేం తక్కువ చేసాం, తమ తప్పేముంది అని మనసులో నొచ్చుకుంటారు. తాము పుల్లగా ఉన్నామన్న నిజాన్ని గుర్తించలేని పసి హృదయం కదా.. ఉడుకుమోత్తనం తో బుంగ మూతి తో బాధ పడతారేమో" అని తన పిల్లలని హృదయానికి హత్తుకుని పట్టుకుని ఉన్నదట. పండి పోయినా రాలిపోనీయకుండా...
పుల్లని వారలంచు రఘుపుంగవడే స్పృశియింపకున్న ! నా
పిల్లలు ఆర్తితోడ విలపించెదరేమొ ! ఫలాలు పండినన్
ఉల్లము నందు హత్తుకొని యుంచెద రాలగనీక రాఘవా !!
తల్లులు తల్లడిల్లరటే? తాళుదురే పసివారి శోకము
త్ఫుల్లసరోరుహాక్ష ! మదిపూజలు గైకొనరా! మనోహరా !!
అయితే ఆ పిల్లలు అమాయకులేం కాదుట.
అయ్యో.. ఒక వేళ మనం పుల్ల గా ఉన్నాం కదా అని రాముడు గనక తినకుండా మనని పక్కన పెట్టేస్తే , "నా కడుపున పుట్టటం వలన కదా వీరికి రామ స్పర్శానుభూతి లేకపోయిందే " అని తల్లి మనసు నొచ్చుకుంటుందేమో అని పండి పోయినా సరే నేల రాలి పోకుండా ఆ తల్లి ని అలాగే హృదయానికి హత్తుకునే ఉండిపోయాయిట.
అమ్మరొ! పళ్ళుపుల్లనని అచ్యుతుడే దలపోవ "నాదు గ
ర్భమ్మున బుట్టి సేవనిడు భాగ్యము గోల్పొయెనంచు క్రుందు" మా
యమ్మ ! భరింపగల్గుదుమె ఆయమ బాధ ! మనస్సెరుంగమే
గమ్మున వ్రాలకుండ బిగి కౌగిలి నుండెద మెంత పండినన్ !
(మమ్ము క్షమింపుమయ్య జన మాన్య! అధర్మమనెంచబోకుమా !! )
(అధర్మము+అని+ఎంచబోకుమా = అధర్మమనెంచబోకుమా అని అనుకున్నాను తప్పైతే సరిజేయగలరు)
ప్రకృతి ధర్మానుసారం పండిన పళ్ళు వ్రాలిపోవాలి, కానీ ఇక్కడ ధర్మ వ్యతిక్రమమౌతున్నా అధర్మమని భావనచేయకుమయ్య అని వినతి . తల్లి బాధ పడకూడదని పిల్లలు.. పిల్లలు బాధ పడకూడదని తల్లీ... ఒకరి కోసం ఒకరు ఆలోచిస్తూ బాధ తెలియకుండా హృదయానికి హత్తుకుని ఉండిపోయాయిట. అన్యోన్యత్వం... పరస్పరం భావయన్తః పరస్పరం బోధయన్తః
ఇంతకీ ఆ తల్లి ఎవరో తెలుసా.. "నేరేడు చెట్టు". రాముడు ఈ అన్యోన్యత్వానికి ముగ్ధుడైపోయాడు. అందుకే మరు జన్మ లో "కృష్ణ" వర్ణం ఎంచుకున్నాడేమో ...ఇంతటి 'ఉన్నతమైన' భక్తీ భావం ఉంది కనుకనే పళ్ళ చెట్లలో చాల 'ఎత్తుకు' పెరిగే చెట్టు కూడా నేరేడు చెట్టు మాత్రమె....
Sanath Sripathihttp://www.blogger.com/profile/03060064499011873930noreply@blogger.com1tag:blogger.com,1999:blog-8916909504656525965.post-33131150535631871692011-07-27T23:26:00.000-07:002011-07-28T21:11:37.382-07:00భద్రాద్రి సీతారాముల వారి గోత్రనామాలు
మా ఇంట రాముల వారి కళ్యాణం గత పాతికేళ్ళుగా నిర్వహిస్తున్నా... మా నాన్నగారు రాసి పెట్టిన స్వామి వారి గోత్రనామాల పుస్తకం కనపడక ఈ సంవత్సరం కొంచం ఖంగారయ్యింది. ముక్కు రాఘవుణ్ణి, కామేశ్వరరావు గారినీ, తెలిసిన మిగిలిన సాహితీ బంధువులనీ అడగటానికి ప్రయత్నం చేశా ఆఖరు నిమిషంలో, కానీ వివరాలుతెలియలేదు
మొన్న భద్రాచలం లో ప్రధానార్చకులవారిని అడిగి వ్రాసుకుని వచ్చాను. మీ అందరికోసమై ఇక్కడ పొందుపరుస్తున్నా....ఇది "శంఖచక్రధారి అయిన భద్రాచల రామ నారాయణుని ప్రవర. అయోధ్యా రాముడిది కాదు)
అమ్మవారు:
చతుర్వేదాధ్యాయినీం, సౌభాగ్య విశ్వంభరీం, నిరాకార, సాకార చతుజిగీశ్వర త్రయార్షేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవాం....
విశ్వంభరశ్శర్మణో నప్త్రీం
రత్నాకరశ్శర్మణః పౌత్రీం
క్షీరార్ణవశ్శర్మణః పుత్రీం
శ్రీ సాక్షాన్మహాలక్ష్మీ స్వరూపిణీం సీతా నామ్నీం ఇమాం కన్యాం
అయ్యవారు:
అనంత వేదాధ్యాయనే, అచ్యుత పరబ్రహ్మణే, ఆదినారాయణాయ
నిరాకార, సాకార, పరవ్యూహ, విభవ, అంతర్యామి అర్చావతార పంచార్షేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ
పరబ్రహ్మ శర్మణో నప్త్రే
వ్యూహనారాయణ శర్మణః పౌత్రాయ
విభవవాసుదేవ శర్మణః పుత్రాయ
సాక్షాన్నారాయణ స్వరూపాయ శ్రీ రామ చంద్ర పరబ్రహ్మణే వరాయ
(మా నాన్న గారు అజ, రఘు దశరథ వంశ ప్రవర వాశిష్ట మైత్రావరుణుల గోత్రప్రవరతో చెప్పేవారేమోనని లీలగా గుర్తు)
Sanath Sripathihttp://www.blogger.com/profile/03060064499011873930noreply@blogger.com6tag:blogger.com,1999:blog-8916909504656525965.post-80511431166669063242011-07-20T19:44:00.000-07:002011-07-20T19:44:51.202-07:00భద్రగిరికి వెళ్తున్నా...
దాదాపు 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ 4 రోజులకి భద్రగిరికి వెళ్తున్నా. నా పాత రోజులు, అప్పటి అనుభూతులు గుర్తొస్తున్నాయి...నేనూ, నాగ మురళి, మోహన్, శివాజి ... గురువుగారితో, నాన్నగారితో గడిపిన అప్పటి స్మృతులు నన్ను పెనవేసుకుంటున్నాయి...
ఎప్పుడెప్పుడు చేరుతానా అన్నట్టుంది ....
ఊరు చేరాలి మన ఊరు చేరాలి
గలగల గలగల కొమ్ముల గజ్జెలు, ఖణఖణ ఖణఖణ మేళ్ళో గంటలు ఆ....ఆ.... (2)
వాగులుదాటి వంకలు దాటి ఊరు చేరాలి మన ఊరు చేరాలి
నల్లని మబ్బులు గుంపులు గుంపులు
తెల్లని కొంగలు బారులు బారులు అవిగో అవిగో అవిగో అవిగో
నల్లని మబ్బులు గుంపులు గుంపులు
తెల్లని కొంగలు బారులు బారులు అవిగో అవిగో అవిగో
ఆ...ఆ... పచ్చనితోటలు విచ్చిన పూవులు
ఊగే గాలుల తూగే తీగలు అవిగో...
కొమ్మల మూగే కోయిల జంటలు
ఝుమ్మని మూగే తుమ్మెద గుంపులు అవిగో అవిగో
ఆ...ఆ......ఆ....ఆ.......
Sanath Sripathihttp://www.blogger.com/profile/03060064499011873930noreply@blogger.com3tag:blogger.com,1999:blog-8916909504656525965.post-30902296556329939362011-06-02T00:56:00.000-07:002011-06-02T04:42:05.537-07:00బాపు బొమ్మలు చూద్దాం రండి.
తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి అన్నది ఒక తరం నానుడి అయితే కాబోయే పెళ్ళికూతురు బాపు బొమ్మలా ఉండాలన్నది నేటి తరం నానుడి. అది చూసినవాడికి, ఆనందించినవాడికీ మాత్రమే తెలిసే రుచి. తెలుగునాట బాపు బొమ్మల గురించి తెలియని పాత తరం వారు బహు తక్కువ. స్వాతి లో కోతి కొమ్మచ్చి పేర బాపూ రమణల విన్యాసం చదివినతర్వాత ఈ కాలం వారికి కూడా కొంచం తెలిసి ఉండచ్చు. ఒకవేళ అరాకొరా తెలియని వాళ్ళెవరైనా మిగిలి ఉన్నట్టైతే (అందునా హైదరాబాదు వారైనట్టైతే ) వారికి ఇదొక మంచి అవకాశం. (తెలిసిన వారికి బహు పసందైన అవకాశం)
సోదరుడు ఆర్టిస్ట్ అన్వర్ గారు ఆ నెల 4,5,6 తేదీలలో హైదరాబాదులో బాపుగారి బొమ్మల కొలువు పెడుతున్నారు. పైన పెట్టిన ఆహ్వానపత్రం వారిదే...
http://thisisanwar.blogspot.com/2011/05/blog-post_31.html
మీ ఇంటిల్లిపాదీ బంధుమిత్ర సపరివారం గా విచ్చేసి బాపూబొమ్మల షడ్రసోపేతమైన విందునారగించి కళాతాంబూల సేవనం చేసి బాపిస్ట్లమైన మమ్మానందింపజేయమని ప్రార్థన
దేవుళ్ళబొమ్మలైతేనేమి, వ్యంగ్య కార్టూన్లైతేనేమి, పోర్త్రైట్ లైతేనేమి అన్నింటిలోనూ బాపుగారిదొక విలక్షణత. ఎంత విలక్షణ అంటే ఆయన రాత పేరన ఒక ఫాంటే ఉంది. బహు కొద్దిమందికి మాత్రమే దక్కే అతి గొప్ప, అరుదైన గౌరవం అది. తెలుగున్నంత కాలం, కంప్యూటరున్నంతకాలం వారి రాత, తెలుగుదనం మీద ఆప్యాయత ఉన్నంతకాలం వారి గీత శాశ్వతం గా ఈ నేల నాలుగుచెరలా నిలచి ఉంటాయి. ఉండాలని మనస్ఫూర్తి గా ఆశిస్తున్నా.
Sanath Sripathihttp://www.blogger.com/profile/03060064499011873930noreply@blogger.com2tag:blogger.com,1999:blog-8916909504656525965.post-74055668863443723422011-02-23T23:54:00.000-08:002011-02-24T11:24:19.932-08:00ముళ్ళపూడి పట్టె మోక్ష పథము !!
మీకిది భావ్యమా? రమణ ! మీకయి మీరిటు నిశ్చయించినన్
మాకెవరయ్య దిక్కు యని మారము చేయరొ బుంగమూతితో
మీ కతి ప్రీతిపాత్రులగు మీ బుడుగున్, మరి బాపు బొమ్మలున్!
శ్రీ కరమైన ధామమును జేరగ మీకిటు తొందరేలనో?
కమ్మగ కధలను జెప్పగ
రమ్మని పిలుపొచ్చెనేమొ రమణకు ! బాపూ
కొమ్మల నూగెడు కోయిల
ఇమ్మహి విడి నాకమునకు ఇటజనె నకటా !!
కళ్ళల్లో వెలుగువు మా
ఇళ్ళల్లో నవ్వునింపు ఇనుడవు ! నీకే
మళ్ళీ జన్మొకటుంటే
వెళ్ళొచ్చెయ్ ముళ్ళపూడి వెంకట రమణై !!
మా తండ్రిగారికి బాబాయి వరస ఔతారు శ్రీ ముళ్ళపూడి వారు (పెత్తల్లి, పినతల్లి బిడ్డలు). ఎప్పుడు మద్రాసు వెళ్ళినా కక్కిగారిని (ముళ్ళపూడి వారి తల్లిగారిని) కలవకుండా వచ్చేవారు కాదు నాన్నగారు. రాముడూ - స్ఫూర్తి అని నేన్రాసుకున్న పద్యాలు విన్న మొదట్లో నాన్నగారు బాపు రమణలకు వీలైనప్పుడు చూపిస్తే సంతోషిస్తారు అన్నారు. అది కాస్తా తీరకుండానే వీరు విజయం చేయటం.... వేటూరివారు, ముళ్లపూడి వారు మొదలైన హేమాహేమీలు, జగజ్జెట్టీలు ఇట్లా తెలుగు ప్రియులను వదిలి సుదూర తీరాలకు వెళ్ళిపోవటం అత్యంత దురదృష్టకరం....
వారి రచనలద్వారా, వారి బుడుగుద్వారా, బాపూ బొమ్మలద్వార వారు మనలకు స్ఫూర్తి కలిగించాలని ఆకాంక్షిస్తూ...
(నాకు నచ్చిన ఈ బొమ్మ అన్వర్ గారు వేసినది. దాని లంకె ఇక్కడ)
http://www.flickr.com/photos/anwartheartist/5441482567/sizes/m/in/photostream/
వారి నుండీ లిఖిత పూర్వక అనుమతితీసుకోకుండా ఇక్కడ ప్రచురించినందుకు వారికి సభాముఖంగా క్షమాపణలు
Sanath Sripathihttp://www.blogger.com/profile/03060064499011873930noreply@blogger.com5tag:blogger.com,1999:blog-8916909504656525965.post-36677586474895936902011-02-18T03:05:00.000-08:002011-02-18T03:05:12.286-08:00Information Science లో నూతన శకం - IBM వాట్సన్ !!
Information Science లో నూతన శకానికి నాంది పలికింది - IBM వాట్సన్ !!
జెపార్డీ అనే టెలివిజన్ గేం షో లో ఇద్దరు మేటి ఆటగాళ్ళతో పోటీపడి వాట్సన్ అజేయంగా నిలవడం ద్వారా ఒక నూతన
శకానికి నాంది పలికింది. నార్త్ అమెరికా అంతటా వందలాది మంది ప్రత్యక్షంగా వీక్షిస్తుండగ వాట్సన్ ఈ అద్భుతాన్ని ఆవిష్కరించింది.
శతాబ్ది వత్సరంలో IBM నుండీ అందివ్వబడుతున్న అత్యంత ప్రతిభావంతమైన ఉపకరణం ఈ IBM వాట్సన్ !!
http://www.youtube.com/watch?v=lI-M7O_bRNg&feature=player_embedded#at=56
ఇట్సిన్క్రెడిబులమేజింగ్,
వాట్సన్స్విన్ ఇన్ జెపార్డి వస్ వర్త్వాచింగ్
హాట్సాఫ్ టుదిఎంటైర్టీం
వాట్సార్టాఫ్ ప్రైడిటీజండ్వాట్సైబీయం !!
It's incredible, Amazing
Watson's win in Jeopardy was worth watching !!
Hats off, to the entire team,
What sort of pride it is and what's IBM.
Sanath Sripathihttp://www.blogger.com/profile/03060064499011873930noreply@blogger.com2tag:blogger.com,1999:blog-8916909504656525965.post-81110461924518496922011-02-01T23:21:00.000-08:002011-02-03T17:38:47.347-08:00త్యాగయ్య - అందుకో నా వందనాలు !!
అందరికీ త్యాగరాజ ఆరాధనోత్సవాల శుభాకాంక్షలు (ఆలస్యంగా)
యోగము చేసెనో? విమల యూహల మిమ్మనుభూతి చెందగా
యాగము చేసెనో? స్వర లయాత్మకులౌ మిము ప్రస్తుతింపగా
ఏ గరిమన్ లభించెనయ ఇంతటి తీయదనమ్ము వ్రాయగా
త్యాగయకున్, వచింపుమయ ! దాశరధీ, హృదయాంతరాకృతీ !!
ఏ రస వాహిని మదికిన్
తారణ మార్గమ్ము నిచ్చె, తలచెద వానిన్
కారుణ్యామృత రాశిని,
తారక నామమ్ము వాని, త్యాగయ వానిన్ !!
Sanath Sripathihttp://www.blogger.com/profile/03060064499011873930noreply@blogger.com19tag:blogger.com,1999:blog-8916909504656525965.post-83811017934417072362011-01-27T10:31:00.000-08:002011-05-30T04:35:31.248-07:00పూరించిన (సమస్యా) శంఖం : శ్రీ కంది శంకరయ్య గారు
కంది శంకరయ్య గారికి పోలికలు చెప్పాలంటే "జగమెరిగిన బ్రాహ్మడు", "అలుపెరుగని బాటసారి". "నిత్య కృషీవలుడు" మొదలైనవి టపటపా వచ్చేస్తాయి. అన్నింటిలోకీ ఉత్తమమైనది మాత్రం "నిశ్శబ్ద విప్లవం". నిర్మొహమాటం గా చెప్పాలంటే రెండొందలు పై చిలుకు సమస్యలనిచ్చినా ఇంకా ఆయన "కొత్త బిచ్చగాడే - పొద్దెరగడు". పండగలేదు పబ్బం లేదు, శనివారం లేదు ఆదివారం లేదు, సమస్యలు వస్తూనే ఉంటాయి. పూరించపోతే వెనకబడిపోతున్నామనే దిగులు పట్టుకుంటుందనటంలో అతిశయోక్తి లేదు.
ఈత నేర్చుకొనుట ఎట్లు? వంటి క్లాసులు తీస్కోకుండా ఎందరినో ఏట్లోకి దింపి, ఈత కొట్టించిన ఘనత, చెయ్ తిరిగిన ఈతగాడికి మల్లే ఫీట్లు కొట్టించిన ఘనత ఈయనదే. దిగితేనే ఈత వస్తుంది, మొదలెడితేనే రాయటం వస్తుంది. ఏదో భావాన్ని ఊహించుకుని రాసుకో అనటం వేరు. అది ఇంటర్మీడియట్, ఆపై చదువులాంటిది. అది కొందరికి అబ్బుతుంది. కానీ ఎంతోమందికి క్లాసు వర్కు, హోం వర్కు ఇస్తూ నేర్పవలసి రావచ్చు. జ్ఞానార్జన పెంచటం, సందేహాలనూ, దోషాలనూ తీర్చటం, భాషణలెక్కువ ఇవ్వకుండా బాధ్యత తలకెత్తుకోవటం అందరికీ సాధ్యమయ్యేది కాదు.
ఒంట్లో బాగోలేకపోతే సమస్యాధార కి ఆటంకమౌతోందేమో అని చిన్నబుచ్చుకుంటారు. ఇంట్లో నెట్ లేకపోతే ఎక్కడో ఇంటర్నెట్ సెంటర్ లో కూర్చుని త్వర త్వరగా దిద్దుబాటులిచ్చేసి వెళ్ళిపోతారు. అడగనివాడిది వాడిది తప్పు అన్నట్టు అడిగిన ప్రతివాడికీ విద్యా దానం చేస్తునే ఉన్నారు, రాసిన ప్రతీ పూరణకీ స్పందిస్తారు. ఆత్మీయంగా హృద్యంగా పలకరిస్తారు. ఆడంబరాలకీ, భేషజాలకీ ఏమాత్రం తావివ్వని వ్యక్తిత్వం. అన్నీ వెరసి అన్నపూర్ణలా సుష్టుగా భోంచేయిస్తారు.
నిశ్శబ్ద విప్లవం కాస్త పెద్దమాటేమో అని అనిపించవచ్చు. అంత తెచ్చేసిన విప్లవం ఏముంది అని కూడా అనిపించవచ్చు. "నేను సైతం పద్య వీణకు కవులనే తంత్రులుగ జేస్తాను" అన్నట్టుగా చ్చిన్న చిన్న ఎక్షర్సైజులతో ఒక్కొక్కరిచేత ఇన్నేసి పద్యాలకు పూరణలు ఇప్పింపజేయటం మాటలా? బిందువు బిందువును జేరి సింధువగును అన్న దాశరథిగారి మాటలు వీరి కర్తవ్య నిర్వహణలో నిత్య సత్యాలు.
కెమిస్ట్రీ చదువుకునేటప్పుడు కేటలిస్టు అన్నది ఒకటి ఉంటుందనీ, రసాయనిక చర్యలలో దానంతట అది ఏమీ చెయ్యదు కానీ దాని సాన్నిధ్యమే చెయ్యాల్సినది చేసేస్తుందనీ చిన్నప్పుడు చదువుకున్నం. ఇప్పుడు అనుభవం తో నేర్చుకుంటున్నాం
ఎన్టీవోడికున్నంత ఫాన్ ఫాలోయింగు రేలంగికి ఉండకపోవచ్చు. కళామతల్లి సేవలో వారి స్థానం వారిది. కవిత్రయాన్ని, పోతననూ, విశ్వనాథనూ వివరింపకపోవచ్చు కానీ తెలుగు సాహిత్య సేవలో శంకరైయ్య గారి స్థానం వారిది.
నన్ను ప్రభావితం చేసిన వ్యక్త్యులలో శంకరయ్య గారొకరు. వారికిదే కృతజ్ఞతా పూర్వక నమస్కృతి
స్పందనమును నేర్పి పద్యాలు కూర్పించి
పూరణమ్ము లిచ్చె పుణ్య మూర్తి
ఏమొసంగగలను? ఈ పద్య పుష్పమ్ము
కంది శంకరయ్య కంద జేతు
లంకె : http://kandishankaraiah.blogspot.com/
Sanath Sripathihttp://www.blogger.com/profile/03060064499011873930noreply@blogger.com7tag:blogger.com,1999:blog-8916909504656525965.post-32802686729535884102011-01-26T12:33:00.000-08:002011-01-26T12:33:51.717-08:00గణతంత్ర దినమ్మునాడు క్షమియింపగదే?
అణువణువున దోపిడితో
క్షణమునకో కుట్రతోడ, కక్షలతో దు
ర్గుణముల వెల్గెడి బిడ్డల
గణతంత్ర దినమ్మునాడు క్షమియింపగదే ?
Sanath Sripathihttp://www.blogger.com/profile/03060064499011873930noreply@blogger.com0