Monday, July 27, 2009

మా బుడుగు ప్రశ్నావళి.

అదేదో సినిమాలో బాబూ మోహన్ "ఎందుకు? ఏమిటి? ఎల్లా?" అని అడిగినట్టు నర్సరీలో జేరినప్పట్నుంచీ మా వాడి దగ్గర అమ్ములపొది బాగాచేరినట్టుంది. ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించేస్తున్నాడు. అది మావరకూ ఉంటే సరేసరి. ఆ స్కూల్లో టీచర్లకి కూడా అంటించి వాళ్ళ దుంపతెంపుతున్నాట్ట. సరిగ్గా నెలరోజులయ్యింది స్కూలు కెళ్ళబట్టి. అప్పుడే టీచర్ల మీటింగు, అందులో వాళ్ళ పితూరీలు.

ముందుగా..
(1) అసలే "కాన్సెప్టు" స్కూలాయె. మాటలూ, ఆటలూ, ఇన్స్ట్రక్షన్సూ ఆంతా ఇంగ్లీషు లోనే. డోంట్ రన్, డోంట్ క్రై, డోంట్ డూ, |మొ|... కట్ చేస్తే, వీళ్ళకి క్లాసులో రైమ్స్ నేర్పిస్తున్నార్ట.

"లండన్ బ్రిడ్జీస్ ఫాల్లింగ్ డౌన్.. ఫాల్లింగ్ డౌన్..ఫాల్లింగ్ డౌన్."
"london bridge is falling down,.. falling down , falling down...."

నేర్పిస్తున్నంతలోనే మా వాడు అచ్చ తెలుగులోకి దిగిపోయాట్ట, భాష్యం చెప్పేయటానికి (స్కూల్లో టీ చర్లకే, అదీ వాళ్ళు అడక్కుండానే), "మాట వినకుండా పరిగెత్తింది లండన్ బ్రిడ్జి. అందుకే కింద పడ్పోయింది"...అంతే క్లాసు మొత్తం TIDE అవాక్కయారా అన్నట్టు నోరెళ్ళబెట్టేసారుట.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
(2) స్కూల్లో పిల్లల్ని వాన్లో ఆడుకునే ప్లేసుకి తీసుకెళ్ళబోయార్ట ప్రిన్సిపాల్ గారు. ముందు సీట్లో వీడు ఇంకో ముగ్గురు పిల్లలు కూర్చున్నారుట. రోడ్డు మీద బండికి ఎవడో అడ్డంగా పరుగెత్తుకొచ్చేస్తూంటే, సడన్ బ్రేకు వేసి, ఒక్కసారి గయ్య్ మందిట ఆడ్డొచ్చినవాణ్ణి ఆవిడ.
అప్పుడు ఇదిట ఆవిడకీ, మా వాడికీ జరిగిన సంభాషణ.
వీడు :"ఎవరు వాడు"
ఆవిడ: "ఎవరో"
"ఎవరోనా..వాడి పేరేంటి? " వీడి ప్రశ్న.
"నాకు తెలీదు"
"ఎందుకు తెలీదు?",
"నేను అడగలేదు."
"ఎందుకు అడగలేదు"
......
"ఎందుకు అడగలేదు టీచర్"
"వాడెవడొ పిచ్చోడు"
"పిచ్చోడా...."
........
(కాసేపయ్యకా మళ్ళీ వాడే అడిగాట్ట)"పిచ్చోడంటే?....పిచ్చోడంటే ఏంటి?"
.....
(వాడు మళ్ళి అడిగాట్ట)"పిచ్చోడంటే ఏంటి టీచర్?" (మా వాడి నస మొలయ్యింది అంటే ఇక ఆగదు కదా)
.....
"ఆ పిచ్చోడి పేరేంటి టీచర్".This was heights. (ఈ సారి తిక్కరేగినట్టుంది ఆవిడకి).
"నాకు తెలీదు"
"ఎందుకు తెలీదు టీచర్?" (ఒళ్ళు మండినట్టుంది)
"కాసేపు మాట్లాడకుండా కూర్చుంటావా?"
........
కొంచం గాప్ ఇచ్చి అడిగాట్ట,అమాయకంగా. "మాట్లాడకుండా కూర్చుంటే, అప్పుడు తెలుస్తుందా ???"
(ఈసారి నిజంగానే కళ్ళు 'భళ్ళ్'అని పేలాయి కాబోలు. )
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
(3) స్కూల్లో ఆటలకని sand pit, water pit, balls room లాంటివేవో ముందున్న ఖాళీస్థలంలో ఆడిస్తూంటారు. మావాడికి కార్ల పిచ్చి. దాంతో 'రాను. నేను లోపలే ఆడుకుంటా' అన్నాట్ట. ఆయమ్మ అడిగిందిటమీ ఫ్రెండ్స్ అందరూ ఆడుకుంటున్నారు, నువ్వెందుకు రావు అంటే, "సూర్య భగవానుడు స్ట్రా పెట్టి తలలో ఉన్నందంతా తాగెస్తాడు". (సన్ ఫీస్ట్ సాఫ్ట్ డ్రింక్ యాడ్ లో చూపిస్తారు స్ట్రాపెట్టి పిల్లల్లో ఉన్న అంతా తీసేస్తున్నట్టు. ) ఆయమ్మకి పగటి పూటే చుక్కలు కనిపించాయిట.

ఒరోర్నీ దుంపతెగ అన్నట్టుంటాయి వాడి తో ప్రతిదీ ను.

7 comments:

  1. :)))
    హమ్మో.. మీ బుడుగు పిల్లాడు కాదూ.. పిడుగన్న మాట.!

    ReplyDelete
  2. abba bhale piduge mee vaadu.
    pichodu gurinchi bagudi.
    mee pidugu peru cheppaledu.

    ReplyDelete
  3. పాపం,, ఆ టీచర్లు బుక్ ఐపోయారు. ఎంతమందికి మతి చలిస్తుందో ???

    ReplyDelete
  4. ఏమైనా మా మేనల్లుడు మంచి చలాకీగా ఉన్నాడండోయ్... ఈ మామ ముద్దులిమ్మన్నాడని చెప్పండి :)

    ReplyDelete
  5. మధురవాణి గారూ, సుభద్రగారూ, రవిగారూ, జ్యోతి గారూ ధన్యవాదాలు.

    రాఘవా! ఈ మధ్య ఉత్తరాల బట్వాడా లో ఇట్లాంటి ముద్దుల్ని పార్సిల్ ఒప్పుకోవట్లేదు. ముఖతహ ఇవ్వాలిట.

    ReplyDelete