Friday, January 8, 2010

గరికపాటి వారి చెణుకులు -1

గరికపాటి 75 పద్యాలను అలవోకగా ధారణ చేశారని భైరవభట్ల కామేశ్వర రావు గారు రాశారు.

సముద్రాన్ని దాటిన వాడికి పిల్ల కాలువ ఒక లెక్కా అన్నట్టు సహస్రావధాన సమయంలో 750 పద్యాలను అలవోకగా ధారణ పట్టగలిగిన వ్యక్తి కి 75 ఒక లెక్కా??

కాకినాడ సాగరతీరం లో సహస్రావధానం చేశారు గరికపాటి. అందులో అద్భుతమైన వర్ణనలూ, దత్తపదులూ, సమస్యలూ, ఆశువులూ.... ముత్యాలు మచ్చుక్కి కొన్ని (ఔత్సాహికులకి ప్రోత్సాహం గా ఉంటుందని సమస్యలకి పూరణలు ఇవ్వట్లేదు)

క్లిష్టమైనవి
(1)జానేదో సినిమాకు లాలు బహు పూజ్యంబౌ మునీశాళికిన్
(2)కలరా రోగములున్న రాఘవుడు లంకంజేరె శతృఘ్నుతో
(3)మానము లేని స్త్రీని గని మాతగ మ్రొక్కిరి పండితోత్తముల్
(4)మన భార్య ఈమె, మనకమ్మయొ, అక్కయొ గావలెన్ జుమీ
(5)బూతుకు బూతు బూతునకు బూతుకు బూతుకు బూతు బూతుకున్
(6)సీతా! రామునికిట్లొనర్తువటవే సీ! ద్రోహమిల్లాలివై

సరసమైనవి
(7)పతి జూచిన పడతి గుండె భగ్గున మండెన్
(8)దున్నను గని కన్ను గీటె తొయ్యలి యహహా

దుష్కర ప్రాస
(9) రాష్ట్రమునేలగా నొక విరాధుడు రావలె రక్తపాయియై

ఇంకెందుకాలస్యం...? కానిచ్చెయ్యండి

3 comments:

  1. గరికపాటి వారి గురించి వినడమే కానీ ఒక్క అవధానమూ చూసే భాగ్యం ఇంకా కలగలేదు. ఇలాటివి విడియోలు యూ ట్యూబ్ లాటి వాటిలో షేర్ చేస్తే ఎంత బావుండును అనిపిస్తుంది. అడ్డమయిన కార్యక్రమాలకి గంటల కొలదీ ప్రసారం చేస్తే టీవీ చానళ్ళు ఇలాటివి ఒక కనీసం ఒక పూట మొత్తం ప్రసారం చేస్తే బావుంటుంది.

    ReplyDelete
  2. దున్నని గని కన్ను గీటె తొయ్యలి యహహా (దుష్కర ప్రాస)
    ఇందులో దుష్కర ప్రాస ఏమున్నదండీ.

    6)సీతా! రామునికిట్లొనర్తువటవే సీ! ద్రోహమిల్లాలివై
    దీనికి జాలజగతి లో తాడేపల్లి వారు అద్భుతమైన పూరణ చేశారు.

    ReplyDelete
  3. సనత్ గారూ
    "దున్నని గని కన్ను గీటె తొయ్యలి యహహా" యా
    లేక
    "దున్నను గని కన్ను గీటె తొయ్యలి యహహా" యా?
    భవదీయుడు
    ఊకదంపుడు

    ReplyDelete