Saturday, May 22, 2010

రాలిన సాహితీ సుమం - వేటూరి

తెలుగు తల్లికి సాహితీ సమర్చన చేసిన సత్కవి, సినిమా పాటల ద్వారా ఎందరి గుండెల్లోనో తెలుగుదాన్ని చిరస్థాయిగా నింపిన స్రష్ఠ, మహోన్నత వ్యక్తి శ్రీ వేటూరి సుందర రామ మూర్తి గారికి హృదయ పూర్వక పద్య సుమాంజలి

కొందరు భాష జూచెదరు ! కొందరు భావ పరంపరల్ గనున్ !
కొందరు భక్తి గ్రోలెదరు ! కొందరు సూక్తుల నాదరింపగన్ !
ఇందరి కిన్ని ఇచ్చు కలమే అది? తెల్గుతనాని కంతకున్
సుందర రామ మూర్తి ఒక సూత్రమొ? గోత్రమొ? దివ్య నేత్రమో !!




7 comments:

  1. ఆయన లేని తెలుగు చలనచిత్రగీతసీమ సూర్యుడు లేని వేకువ లాంటిది. వేటూరి గొప్పదనం వర్ణించడానికి వీలు లేనిది.

    ReplyDelete
  2. సాహితీ మూర్తి వేటూరిగారికి శ్రద్ధాంజలి.

    ReplyDelete
  3. వేటూరి వారొక ఐకన్. ఆయన లేని తెలుగుపాట ఊహించలేము. ఆ మహానుభావుడికి అశ్రునివాళి.

    ReplyDelete
  4. పద్యం బాగా వచ్చిందండీ, నాల్గో పాదం చాలా చాలా బాగుంది. కొమ్మకొమ్మకో సన్నాయి లో దాశరధి గారి పుట్టినరోజుకి ఓ కందపద్యం చదివితే తిరిగి ఆయన నాపై ఉత్పలమాల చెప్పారు అని వేటూరి వారు గుర్తు చేసుకున్నారు .. ఆ దాశరధి గారి పద్యం లో కూడా నాల్గో పాదం సుందర రామమూర్తి అనే మొదలవుతుంది.
    రెండేళ్ల కిందటి మాట, వేటూరి వారి పై నే నో పద్యం రాస్తే రాఘవ గారు గొంతు కలిపారు ఓ మారు చూడండి. http://vookadampudu.wordpress.com/2008/02/20/%E0%B0%B5%E0%B1%87%E0%B0%9F%E0%B1%82%E0%B0%B0%E0%B0%BF%E0%B0%95%E0%B1%8B-%E0%B0%89%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AA%E0%B0%B2%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B2/
    భవదీయుడు

    ReplyDelete
  5. Sanath Sripathi గారూ...,

    నమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి
    ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు
    నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,
    మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.

    తాజా టపాలనే కాక బ్లాగుల్లో లభ్యమయ్యే జ్ఞానాన్ని వివిధవర్గాలగా క్రోడీకరించి, గత నాలుగు సంవత్సరాలుగా
    తెలుగు తల్లి నోటినుంచి రాలిన ముత్యాలను గుదుగుచ్చి మీ ముందుంచుతుంది. ఈ ప్రయత్నంలో
    హారం ప్రస్తుతానికి ఆధ్యాత్మికం, పద్య సాహిత్యం, సాంకేతికం, హాస్యం, పాటలు,సినిమాలు, బొమ్మలు,సంగీతం, కవితలు, బాలసాహిత్యం, వంటలు మొదలైన వర్గాలుగా క్రోడీకరించి చూపిస్తుంది. .

    మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో హారం లింకు ను వుంచి ప్రోత్సహించండి. హారం లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి . టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.

    - హారం ప్రచారకులు.

    ReplyDelete
  6. సందీప్, విజయ్ మోహన్, రవీ నెనర్లు.

    ఊ.దం. గారూ, మీ వ్యాఖ్య, మీ టపా, రాఘవ గారి పద్యం ఎంతో బాగున్నాయి. నాకత్యంత ఇష్టులైన సినీ గీతరచయిత త్రయం ఆరుద్ర, వేటూరి, సిరివెన్నల సీతారామశాస్త్రి. వారి వారి పాటల్లో నన్ను బాగ కదిలించే కొన్ని పాటల్ని వీలైనప్పుడు బ్లాగుతా..

    తెలుగుదనాన్ని తన పాటల ద్వారా పరిచయం చేసిన వేటూరి
    " సూత్రే మణిగణాయివ" అనీ,
    "తత్కాలానికీ, తదనుయాయులకీ ఒక గోత్రము/ రెఫెరెన్సు (కృఈస్తు పూర్వం/ క్రీస్తు శకం అన్నట్టు వేటూరి, అరుద్ర ల శకం)" అనీ,
    "వాగర్ధా ప్రతిపత్తు" లనీ అందించిన దివ్య చక్షువు అనీ నా భావం. అందుకే నాల్గవ పాదం లో సూత్రమొ, గోత్రమో దివ్యనేత్రమో అని రాశా.

    సహృదయులకి నచ్చినందుకు ధన్యుడిని.

    కొత్తపాళి గారి టపా కూడా గుండెకు హత్త్తుకుంది. అక్కడ కొన్ని వ్యాఖ్యలు చివుక్కుమనిపించాయి... అనువాదం అంటేనే కత్తి మీద సాము. ఎందుకంటే ఒక్కో భాషకీ కొన్ని వాడుకలు, వ్యావహారికాలూ ఉంటాయి. అల్లాంటివాటిని ఒక బాణికి అనుగుణంగా, స్వర, రాగ భావాల సమ్మేళనంగా పలికించాలి అంటే కొంచం కష్టమే. ఈ విషయాన్ని అవధానాలు చేసేవారు ధృవీకరిస్తారు.

    ఉదాహరణకి ఒకసారి మాడుగుల వారిని పోతన గారి పద్యానికి సంస్కృతానువాదం చెయ్యమన్నరు.

    ఓయమ్మ నీకుమారుడు
    మాయిండ్లను పాలు పెరుగు మననియడమ్మ,
    పోయెదమెక్కడికైనను
    మాయన్నల సురభులాన మంజులవాణి"

    ఇక్కడ వచ్చిన చిక్కేమిటంటే మా అన్నల ఇళ్ళల్లోని ఆవుల మీద ఒట్టు అన్నది తెలుగు వారికే సొంతమైన వాడుక. సంస్కృతంలో ఇల్లా ఒట్లు పెట్టుకోవటం లేదట. అయినా సరే భావాన్ని ఒడిసిపట్టి అనువదించారు నాగఫణి (నాగ్గుర్తున్నత వరకూ ఆ శ్లోకం ఇదీ)

    హే మాతస్తవ పుత్రః
    కతిపయి ఆద్యాహరతి చ గేహస్థం
    గచ్చామః కమపిస్థల మాహో
    ప్రమాణ అత్ర సురభయహార !!

    ఏతావాతా నేన్చెప్పోచ్చేదేమిటంటే ఒక క్రికెటర్ సామర్ధ్యం, పాటవం తెలియాలంటే టెస్టు మ్యాచుల్లో అతని ప్రతిభ, ఆట చూడాలంటారు కదా అట్లా ఒక కవి (ప్రస్తుతం వేటూరి గారి) తెలుగు సాహిత్య సేవని ఆకళింపు చేసుకోవాలంటే అనువాద సాహిత్యం లో వారి కృషిని చూసే కన్నా సందర్భోచితం గా స్వభాషా సాహిత్యాన్ని రుచి చూడాలి. ఉ.దా. "భైరవద్వీపం" చిత్రంలో "శ్రీతుంబురనారదనాదామృతం" అనే పాట.

    ReplyDelete
  7. సందర్భోచితంగా వెలికి వచ్చిన రాఘవ గారి పద్యం, వూకదంపుడు గారి పద్యం, టపాలో మీ పద్యము చక్కగా ఉన్నాయి.

    అనువాదం అంటే, "కావేరీ, అళగియ కావేరీ" కన్నడ పాటకు, "కృష్ణవేణీ, తెలుగింటి విరిబోణీ, కృష్ణవేణీ, మా ఇంటి అలివేణీ.." అన్న ఓ సీత కథ సినిమా పాట గుర్తొస్తుంది నాకు.

    ReplyDelete