Tuesday, February 1, 2011

త్యాగయ్య - అందుకో నా వందనాలు !!

అందరికీ త్యాగరాజ ఆరాధనోత్సవాల శుభాకాంక్షలు (ఆలస్యంగా)

యోగము చేసెనో? విమల యూహల మిమ్మనుభూతి చెందగా
యాగము చేసెనో? స్వర లయాత్మకులౌ మిము ప్రస్తుతింపగా
ఏ గరిమన్ లభించెనయ ఇంతటి తీయదనమ్ము వ్రాయగా    
త్యాగయకున్, వచింపుమయ ! దాశరధీ, హృదయాంతరాకృతీ  !!



ఏ రస వాహిని మదికిన్
తారణ మార్గమ్ము నిచ్చె, తలచెద వానిన్
కారుణ్యామృత రాశిని,
తారక నామమ్ము వాని, త్యాగయ వానిన్ !!

19 comments:

  1. బావున్నాయండి, మకుటం చాలా అందంగా వచ్చింది. మీకు చక్కగా అమరింది.తా పొరబాటున దీర్ఘం బడింది, చూడండి.

    ReplyDelete
  2. ఊదం.గారూ, నెనర్లు. టైపోనూ సరిచేశా, ధన్యవాదాలు

    ReplyDelete
  3. వ్రాతా గీతా రెండూ బాగున్నాయండీ. అభినందనలు, అభివందనములు. :)

    ReplyDelete
  4. చాలా హృద్యంగా ఉన్నాయి పద్యాలు. చిత్రం కూడా చాలా బాగుంది. ఆ కూర్చున్న తీరులోను, ముఖకవళికల్లోనూ త్యాగయగారి తన్మయత్వం చాలా చక్కగా గోచరమవుతోంది!
    పద్యాలలో కొన్ని దిద్దుబాట్లు. "చేసితో" అంటే "చేసావో" అనే అర్థం వస్తుంది, నాకు తెలిసి. "చేసెనో" అన్నది ఇక్కడ సరైన పదం అనుకుంటాను.
    "మిమ్మనుభీతి" - ఇది "మిమ్మనుభూతి" కాదా?
    రెండవ పద్యం మూడవ పాదంలో మొదటి అక్షరం లఘువవ్వడం మూలాన ప్రాస తప్పింది. "కారుణ్య నిధిని" అంటే సరిపోతుంది.

    ReplyDelete
  5. నిజమే కదా... కనీసం ఒక పది సార్లైనా చూసుకుని ఉంటా, సరిగా ఉందా, తప్పులేమైనా ఉన్నాయా అని... కళ్ళెదుటనే ఉన్నా తప్పును ఒప్పుగా చదివేయటం మనసుకు ఎంత సుళువో కదా...

    ధన్యవాదాలు గురూజీ, రాఘవా.. :-)

    ReplyDelete
  6. రాత, గీత రెండూ అద్భుతంగా ఉన్నాయండి..

    ReplyDelete
  7. డియర్ సనత్! అభినందనలు.

    రాత కాదది భక్తుని వ్రాత గాని.
    గీత కాదది శ్రీపతి గీత కాని.
    సత్తుయౌనది కవి సనత్తు చేత.
    వ్రాత గీతల నేర్పరీ! వ్రాయు మెపుడు.

    ReplyDelete
  8. "దాశరధీ, హృదయాంతరాకృతీ !!"

    Beautiful. absolutely beautiful.

    ReplyDelete
  9. వర్ణచిత్ర మందు వాగ్గేయ కారుని
    ప్రభల నలరఁజేయ భాసురుండై
    త్యాగరాజు పాడె రాగ తాళము లందు,
    సనతు దర్శనమ్ము చక్షు హితము !

    సనత్, త్యాగరాజుల వారి చిత్రము చాలా బాగుంది. మీ పద్యములు చిత్రమునకు తగునట్లు మధురముగా ఉన్నాయి. మీకు హృదయపూర్వక అభినందనలు.

    ReplyDelete
  10. నారాయణ స్వామి గారూ, జ్యోతిగారూ, చింతావారు, మూర్తిగారు!!
    ధన్యవాదాలు.

    ReplyDelete
  11. ప్రభల నలరఁజేయ భాసురుండై

    అనే దానిలో భాసురుడయి
    అని వ్రాస్తే సరిపోతుందండి.

    ReplyDelete
  12. సనత్ గారూ,
    త్యాగయ్య గారి బొమ్మ చాలా బాగుంది. ఇంతకు మునుపు మీ బ్లాగు చూశాను కానీ, మీ బొమ్మలని గమనించలేదు. పాత టపాలన్నీ చూశాను. బొమ్మలు, పద్యాలు చాలా బాగున్నాయి.

    ReplyDelete
  13. అద్భుతంగా ఉంది. రంగులు, త్యాగయ్య ముఖంలో నిర్మలత, తేజస్సు చక్కగా కుదిరాయి. మా పాపాయి మీ అంత చక్కగా బొమ్మలు గీయాలని నా ఆశ.

    దాశరధీ, హృదయాంతరాకృతీ! - దాశరథీహృదయాంతరాకృతీ అని సమాసంగా ఉండి త్యాగయ్యనే ప్రశ్నిస్తున్నట్టు ఉంటే బావుంటుందా? ఆలోచించండి.

    ReplyDelete
  14. క్షమించాలి. ఇందాక వ్యాఖ్య ఆవేశంగా రాశాను. దాశరథీ, హృదయాంతరాకృతీ! సబబుగా ఉంది.

    ReplyDelete
  15. శ్రీ చింతా రామకృష్ణా రావు గారికి నమస్కారములు, ధన్య వాదములు. రెండో పాదము సాఫీగా సాగ లేదు. పోస్ట్ చేసాక గణ దోషము చూసాను. రౌటరు ,అంతర్జాలము,సహకరించ లేదు,తప్పు సవరించడానికి.

    ReplyDelete
  16. రవిగారు, ఫణిగారూ !
    ధన్యవాదాలు

    ReplyDelete