Sunday, September 22, 2013

నివాళి...

జీవితంలో మనకు తారసపడే వ్యక్తులు - ఆవసరం కోసం కలుసుకునేవాళ్ళు కొందరైతే, అలవాటు వలన కలుసుకునేవాళ్ళు ఇంకొందరు.. జీవితం లో వీరి ప్రభావం నిజానికి అంతంతమాత్రమే... అయితే వీరికి భిన్నంగా అనుకోకుండానో, అవకాశం వల్లనో, లేకపోతే అదృష్టం కొద్దీనో కలుసుకోగలిగినవాళ్ళు ఇంకొందరుంటరు.. వారందరూ చిరస్మరణీయుల కోవకి చెందుతారు....

అట్లాంటి చిరస్మరణీయులలో ఒకరు ఆర్టిస్ట్ కరుణాకర్ !!

నా రాతలను ప్రభావితం చేసినవారిలో బోయిభీమన్నగారొకరైతే
నా గీతలను ప్రభావితం చేసినవారిలో ఆర్టిస్ట్ కరుణాకర్ ఒకరు...

అదృష్టం కొద్ది ఆయనను మళ్ళీ మళ్ళి కలిసే అవకాశం ఒకానొక అవసరం రూపంలో తటస్థించింది.. నవంబరు 2012 నుండి ఏప్రిల్ 2013 వరకూ దాదాపు నెలకొకసారైనా కలవగలిగేవాణ్ణి..



ఆయన బొమ్మ గురించి కానీ ఆయన వ్యక్తిత్వం గురించి కాని నాకు తెలిసింది అణుమాత్రం.. వేస్తూంటే చూడగలిగే అదృష్టం ఒకట్రెండుసార్లు దక్కింది.. అలాంటి సందర్భంలో ఒకసారి అడిగా.. "మీరు నేర్పిస్తానంటే నేర్చుకునే కళాపిపాసులు, కళా తపస్వులూ కోకొల్లలుంటారు.. మీ కళనందించరూ అని..." ఒప్పుకుంటే శిష్యుణ్ణవ్వాలన్న ప్రగాఢమైన కోర్కెతో...

సిగరెటు పొగ ఊదేస్తూ "టైముండద్దూ.. ఒప్పుకున్నవాటితోనే సమయం చాలడం లేదు, కొత్తవి తలకెత్తుకోవడం కూడానా" అన్నారు..

"మీ గీతలంటే నాకు బహు మక్కువ.. ఆంధ్రభూమి లో సెంటర్ స్ప్రెడ్లూ.. కవర్ పేజీ వెనకనుండే కవితలకు బొమ్మలూఅన్నీ ప్రోగు చేసి పెడుతున్నా.. మా అబ్బాయి కనక చిత్ర రచనమీద ఆసక్తి కలిగి నేర్చుకుంటానంటే వాటినే ఆస్తి ఇచ్చినట్టు ఇస్తాను" అన్నా...

తనను కాక వేరెవరినో ప్రస్తుతిస్తున్నారన్నట్లు నిగర్వంగా..తన కుంచె పనిలో తాను మునిగిపోయారు.

మా అబ్బాయి ఉపనయనం అయ్యాక హడావిడి ప్రయాణం అవడం మూలాన ఆయనను కలిసి ప్రవర చెప్పించి ఆశీస్సులు ఇమ్మనమని అడుగుదామన్న కోరిక నెరవేరనే లేదు..

ఆయన ఎక్కడున్నా తన బొమ్మలతో ఎందరికో స్ఫూర్తినీ, అనుభూతిని అందిస్తూనే ఉంటారు..

జయంతితే సుకృతినో...




3 comments:

  1. Aaa artist gaari gurinchi memu koodaa chaalaa vishayaalu telusukunnamu. Thanks

    ReplyDelete
  2. Sucha sweet and rich tribute. Speaks a lot about the great man...

    ReplyDelete