అల్లరిచేసినా, ఆకలేసినా, నిద్ర వచ్చినా, ఆవలించినా, పండగైనా పబ్బమైనా,ఆటల్లో అరటిపండైపోయినా, వేరెవరైనా తొండి చేసినా అన్నింటికీ కావలసింది అమ్మే. చూస్తే అందరూ చాలా అనందంగా ఉన్నారు నాకు మాత్రం ఏ సరదాలూ లేవు..
తడిస్తే జలుబు చేస్తుందనీ...
అన్ని దిక్కులకీ పరిగెడుతూంటే కాళ్ళు నొప్పులొస్తాయని...
వంటికంతా దుమ్మూ ధూళీ పట్టించుకుంటే క్రిములొస్తాయని...
నాకు చెప్పిందెవ్వరు? నన్ను పట్టించుకున్నదెవ్వరు?
నీట్లో నానకు! వంటి పైన మసి గానీకయ్య చిన్నయ్య! చీ
కట్లో నుండకు! అంబరమ్ము విడబోకయ్యంచు దెల్పంగ నా
కిట్లెవ్వారలు లేరటంచు కినుకన్ కించిత్తు చూపింప నే
డిట్లీరీతి పరుండినాడొకొ శివుండీ హైమ శైలమ్మునన్ !!
అవును... మరీ విడ్డూరం కాకపోతే అంత చిన్నపిల్లవాడికి వంటినిండా ఆ విభూది రేఖలేమిటి? అంత మంచులో చిన్నా చితకా బట్టలేమిటి? భయపడిపొయేందుకా అన్నట్టు మెళ్ళో ఆ పాములేమిటి? ఎప్పుడు చూసినా తలారా ఆ స్నానమేమిటి? ఆడుకోడానికి స్నేహితులేరి? మరి పిల్లవాడలిగాడంటే అలగడూ...
అయినా ఎవరు మాత్రం ఏమి చేస్తారు? అందరికన్నా ముందు పుట్టమని అతగాడికెవరు చెప్పినట్టు? చెబితే చెప్పారు గాక. పొలోమని పుట్టెయ్యడమెందుకు ఇప్పుడు అమ్మకోసం ఆ బుంగమూతెందుకు? అయినా దానికీ వెనుకనేదో ఒక దివ్య లీల ఉండే ఉంటుంది...
"ఉన్నవాడు" తెలియకుండవచ్చును గాని
"లేనివాని" కెఱుక దాని విలువ
ఏమి లేని వాడు ఇహమందు పరమందు
"అమ్మ"నిచ్చె మనకు నందుచేత

నారదాది మునులు నా లీలలని వాని
నెన్నసాగిరయ్య నిజము భస్మ
ధారణమ్మదేమి? ధర్మ భిక్ష మదేమి?
పాము కంఠమందు ప్రాకుటేమి?
అయినా ఎవరు మాత్రం ఏమి చేస్తారు? అందరికన్నా ముందు పుట్టమని అతగాడికెవరు చెప్పినట్టు? చెబితే చెప్పారు గాక. పొలోమని పుట్టెయ్యడమెందుకు ఇప్పుడు అమ్మకోసం ఆ బుంగమూతెందుకు? అయినా దానికీ వెనుకనేదో ఒక దివ్య లీల ఉండే ఉంటుంది...
తల్లి దండ్రి కొఱకు తపియించె గనుకనే
"ధరణి జనుల కేను తండ్రి నౌదు!
లలిత జనని యౌచు లాలించు నని" బల్కి
శివుడు నిలిచె ప్రేమ శిఖర మౌచు
"ఉన్నవాడు" తెలియకుండవచ్చును గాని
"లేనివాని" కెఱుక దాని విలువ
ఏమి లేని వాడు ఇహమందు పరమందు
"అమ్మ"నిచ్చె మనకు నందుచేత
"జగతః పితరౌ" అగుటకు
స్వ గతమ్మే హేతువౌనొ? శర్వా ! మదిలో
చిగురించిన భావమ్మిది
అగణిత గుణ! ఇదియు నీదు ఆశీః ఫలమే !!
అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు.
(బాల శివుని చిత్రం అంతర్జాలము వారి సౌజన్యంతో )
బాలశశాంకశేఖరుడు భవ్యమనోహరమూర్తి నిద్రలో
ReplyDeleteలీలగ జేయు నూహలె స్ఫురించినవేమొ భవన్మనమ్మునన్
లాలితపద్యభావరసరమ్యములై చిగురించె నీ కృతిన్
ఆ లయకారు ప్రేమమహితాత్మనెఱింగినవారు ధన్యులే!
సనత్ గారూ చాలా బావున్నాయండీ పద్యాలు.
ReplyDeleteభైరవభట్ల వారి పద్యం చాలా చక్కగా వచ్చింది....
వారు "బాలశశాంకశేఖరుడు" అనటం చూసిన తరువాత ఓ అరగంట పరికించి చుస్తే గానీ నాకు ఖండబింబం కనబడలేదు..
కామేశ్వరరావు గారు, ధన్యవాదాలు. మీ పద్యం రసరమ్యంగా ఉన్నది. :-)
ReplyDeleteఊ.దం. గారూ.. నెనర్లు.