మా హైద్రాబాదులో ఎండా కాలం వచ్చేసింది, వసంతం వచ్చేవేళ కూడా అయ్యింది కానీ ఎందుకో ... అయినా ప్రచండుడి పత్తా లేదు..సాహిత్యంలో కవ్వింపులు, చదివింపులూ అవుతున్నా ఎక్కడా సడిలేదు...ఎందుకో ఏమో అంటూ రంగం సినిమా సాంగేసుకున్నా ఆన్సరులేదు. ఎందుకంటారు???
బ్లాగెడివాడు పద్యములు బాగుగ నల్లెడివాడు గౌతముం
డేగినమార్గమెప్డు ప్రకటించెడివాడును "జాల" రాయడున్
గాగలనేర్పువాడు! అనకాపలి, అం.ద్ర.ని మధ్యనన్నిటిన్
బ్లాగెదనన్న భాస్కరుడు బ్లాగగవచ్చెనటమ్మ? జెప్పరే !
మరి అతగాడి టాగ్ లైను అనకాపల్లి నుండి అంతర్జాతీయ ద్రవ్య నిధి వరకూ బ్లాగాడిస్తా (ఆరెండూ దక్క)
బ్లాగాడెద తత్త్వములన్
బ్లాగాడెద శాస్త్ర విషయ భావములన్ నే
బ్లాగిడిస్తానని రవి
మూగాంబిక నోమునొకటి మొదలిడెనేమో?
కనిపింపక వినిపించును
గనుకనె కవి యందురతని ! కవియౌ రవియే
కనిపింపడు మరి రవి గాం
చనిచో కవిగాంచుననెడి సామెతలెట్లౌ
బాబూ రవీ నువ్వెక్కడ ఉన్నా నీకోసం బ్లాగ్బంధువులు (ఉత్ప్రేక్ష) వెయ్యి కళ్ళతో (అతిశయోక్తి) ఎదురుచూస్తున్నారని తెలుపుతూ - సనత్
సోదరుడు రవి ఈ మధ్య కాలంలో హైద్రాబాదు నీళ్ళు బడి, పనిలోబడి, ఒత్తిడికి లోబడి సర్వ దర్శనాలు అవీ రద్దు చేసారట. ఎంతైనా సీమనుండొచ్చాడు కదా.. వాళ్ళ వెంకన్నబాబులాగానే ఓన్లీ వీ.ఐ.పీ దర్శనాలు, బ్రేకు దర్శనాలే తప్ప మరొక్క మాట ఎత్తటం లేదుట.. అందుకే సామాన్య బ్లాగ్జనుల తరఫున వంకన్నకీ రవికీ ఇవే అనేకానేక ఆహ్వానాలు...వేడికోలూ... (సరదాగా)
బ్లాగెడివాడు పద్యములు బాగుగ నల్లెడివాడు గౌతముం
డేగినమార్గమెప్డు ప్రకటించెడివాడును "జాల" రాయడున్
గాగలనేర్పువాడు! అనకాపలి, అం.ద్ర.ని మధ్యనన్నిటిన్
బ్లాగెదనన్న భాస్కరుడు బ్లాగగవచ్చెనటమ్మ? జెప్పరే !
మరి అతగాడి టాగ్ లైను అనకాపల్లి నుండి అంతర్జాతీయ ద్రవ్య నిధి వరకూ బ్లాగాడిస్తా (ఆరెండూ దక్క)
బ్లాగాడెద తత్త్వములన్
బ్లాగాడెద శాస్త్ర విషయ భావములన్ నే
బ్లాగిడిస్తానని రవి
మూగాంబిక నోమునొకటి మొదలిడెనేమో?
కనిపింపక వినిపించును
గనుకనె కవి యందురతని ! కవియౌ రవియే
కనిపింపడు మరి రవి గాం
చనిచో కవిగాంచుననెడి సామెతలెట్లౌ
బాబూ రవీ నువ్వెక్కడ ఉన్నా నీకోసం బ్లాగ్బంధువులు (ఉత్ప్రేక్ష) వెయ్యి కళ్ళతో (అతిశయోక్తి) ఎదురుచూస్తున్నారని తెలుపుతూ - సనత్
సోదరుడు రవి ఈ మధ్య కాలంలో హైద్రాబాదు నీళ్ళు బడి, పనిలోబడి, ఒత్తిడికి లోబడి సర్వ దర్శనాలు అవీ రద్దు చేసారట. ఎంతైనా సీమనుండొచ్చాడు కదా.. వాళ్ళ వెంకన్నబాబులాగానే ఓన్లీ వీ.ఐ.పీ దర్శనాలు, బ్రేకు దర్శనాలే తప్ప మరొక్క మాట ఎత్తటం లేదుట.. అందుకే సామాన్య బ్లాగ్జనుల తరఫున వంకన్నకీ రవికీ ఇవే అనేకానేక ఆహ్వానాలు...వేడికోలూ... (సరదాగా)
అవును స్పెషల్ దర్శనాలే. వంశీగారి బ్లాగులో కామెంటుతున్నాడు కదా రవి. పాపం హైదరాబాదు బాసు తెగ బాదుతున్నట్టున్నాడు. కనపట్టంలేదు..
ReplyDeleteహహ్హహ్హ!! అవును, రవి కూడా 'రాయని' భాస్కరుడైపోతున్నారు. ఆయన టపాల్లేక చాలా వెలితిగానే ఉంటోంది. బ్లాగాడిస్తూ ఉండమని ఆయన్ని నేనూ అభ్యర్థిస్తున్నా.
ReplyDeleteఅవునండి రవి గారు రాయక చాల రోజులు అయిపొయింది . అయిన రాసే జ్ఞాపకాల పోస్టుల కోసం నిజం గానే వెయ్యి కళ్ళ తో ఎదురుచూస్తున్నా !
ReplyDeleteబ్లాగకపోవటం ఒకటి - సరే మనకి చదివే తీరిక ఉన్నా - వారికి వ్రాసే వీలు చిక్కలేదేమో అని సరిపెట్టుకోవచ్చు...
ReplyDeleteపాత టపాలను ఐనా చదువుకోనివ్వకపోవటం ఉంది చూశారూ -
ఆభిమాన కధానాయికుడి కొత్త సినిమా వచ్చే వరకు - పాత సినిమానే పదే పదే చూసుకునే అవకాశం కూడ ఇవ్వకపోవటం లాంటిది.
(సాలభంజికల నాగరాజు గారికి కూడ ఈ మాట చేరు గాక)
బాపు గారు శ్రీరామరాజ్యం తీసేదాకా ముత్యాలముగ్గు చూడలేదు? వచ్చిన తరువాత కూడ చూడటం లేదు?
మొన్న ఒక చిత్రమైన అనుమానం వచ్చింది రవి గారి వచనము , సుస్మిత ( కొత్తావకాయ) గారి వచనములలో ఏది మిన్న అని .. పోల్చుకుందామని వెల్తే - దారి కనబడలేదు
బ్లాగ్రవిగారు ఏ మబ్బుచాటున వున్నా వెంఠనే బయటికి వచ్చి బ్లాగ్‌ఫేనుల ముఖపంకజాలను వికసింపజేయవలెనని ప్రార్ధన.
ReplyDeleteపైగా .. ఉగాది ఇంకో మూడు వారాల్లోనే .. కవి సమ్మేళనం జరిపించాలి కూడానూ.
అవునవును మీ ప్ప్రాయమే నాప్ప్రాయం.
ReplyDeleteఅయ్యా అమ్మా,
ReplyDeleteఈ బ్లాగ్ రవి గారెవరు ? వారి బ్లాగాడిస్తా 'బలాగు బాలా ' లింకు ఎవరైనా ఇద్డురూ! మేమూ చదువు తాము ?
చీర్స్
జిలెబి.
హెంత పని చేశారండి? ఏదో బ్లాగువానప్రస్థాశ్రమం నెఱపుతున్న నా మీద ఇలా బ్లాగు చేసుకోవడమా?
ReplyDeleteఈ సారి కవిసమ్మేళనం మాత్రం పెద్దలెవరైనా పూనుకోవలసిందేనండి. కొన్ని సంక్షోభాలలో కూరుకుని ఉన్నాను ప్రస్తుతం. బయటపడడానికి కొంత సమయం కావాలి.
అనకాపలి?? దీనికి కొద్దిగా 'అమవస నిశి' వాసన ఉందనిపిస్తోంది :-)
ReplyDeleteకామెంటిన అందరికీ నెనర్లు.
ReplyDeleteమురళీ నువ్వన్నట్టు "రాయని" భాస్కరుడైపోకూడదనే ఈ పిలుపు.
ఊ.దం. నిఝ్ఝం గా మనసులో మాట బయటపెట్టేశారు. నాకనిపిస్తున్న వెలితి ఏమిటో పద్యం రాసినా భావం బయటపడలేదుగానీ మీ వ్యాఖ్య చదవంగానే కమల్ హాసన్ గొంతుతో " ఆ అదే...అక్కడక్కడ పువ్వు, లవ్వు లాంటివి వేసుకోండి" అన్నట్టు సహస్ర స్వరాలతో మ్రోయించింది (ఏమిటి అని అడగకండి... గ్రాంధికం లో అప్పుడప్పుడు ఇట్లాంటివి కొంచం కామన్)
కొత్తపాళీ గారు ! "అందుకే" కదా ఇలా పబ్లిగ్గా పిలుస్తున్నది..విన్నతరువాతనైనా "ఎవరోయీ పిలిచింది, ఎవరోయీ పలికింది.. కొమ్మావి చిగురులో కులిందీ ఏరోయి.." అంకుంటూ బయటకి వస్తారనే ఆశ.
మిస్సన్నగారూ! మాకింకా అంత ప్రాయమెక్కడుందండీ...పైగా ఇక్కడ మాప్ప్రాయల్లాంటివేమీలేవు మా పాళ్ళు, మా కోళ్ళు తప్ప(విన్నపాళ్ళు, "వేడి"కోళ్ళు). ఏదేమైనా మీరూ మాతో గొంతుకలిపారు గనుక ధన్యవాదాలు..
జిలేబీ గారూ !! తెలియక అడిగారా? తెలిసి మరీ అడిగారా??? బ్లాగ్లోకంలో ఎవరి టపా పేరు చెబితే శివ కేశవులైనా ముక్కున వేలేసుకుంటారో.. జగజట్టిల వంటి కొత్తపాళీ, భైరవభట్ల మొదలుగాగల మొదటి రాయలూ, రెండవ రాయలవారికీ సమ ఉజ్జీగా ఏ ఆధునిక అంతర్జాల భువవిజయ కృష్ణదేవరాయలై మహామహులున్న సభను రంజకంగా సాగించారో...ఎవరి సమగ్రమైన సమీక్ష చదివితే విషయం కూలంకషంగా అవగాహన ఔతుందో... రజనీష్ నీ, బుద్ధుడి జాతకకథలనీ, జిడ్డుకృష్ణమూర్తి తత్త్వాన్ని, పల్లెటురి పరిమళాన్ని, చిత్రకవిత్వ సౌరభాన్ని సోదాహరణంగా ఉటంకిస్తూ, సాహిత్య, పద్య ప్రక్రియల్లో తనదైన శైలితో బ్లాగే ఆ నాలుగోసిమ్హమే పోలీస్ పోలీస్ పోలీస్ (ఐ మీన్ రవీ రవీ రవీ).. అయినా ఎండాకాలంలో మాంచి పెద్దరసాల రుచిని ఎంతని వర్ణించగలం చెప్పండి? ఒక్కసారి తిని చూస్తే ఆ మజానే వేరు. అదే మన ఊకదంపుడుగారనేది కూడా.. బ్లాగాడిస్తా ద్వారాలు ఉత్తర ద్వార దర్శనం చేయిస్తేనేగానీ దాని అనుభవం మాటల్లో చెప్పడం, అందునా నా వంటివాడు చెప్పడం వీలయ్యేది కాదు...
This comment has been removed by the author.
ReplyDeleteపుష్యం !
ReplyDeleteఅమవస నిశి ;) కరక్టే....కవ్వింపులూ, చదివింపులూ అన్నది అందుకే.. మీసం (ప్రస్తుతం ఉందో లేదో తెలీదు) రోషం ఉంటే తప్పక బయటకి వచ్చి వ్యాఖ్యనిస్తారని.
అయినా రవిగారి కోసం ఊదంగారిలాగానే నేనూ ఎదురుచూస్తూ చూస్తూ టైం పాస్ పల్లీలు తిని తినీ చివరికి చేతిలో ఉన్నవి అయిపోతే అటూఇటూచూస్తూంటే అనకాపల్లి దడుచుకుంది ఎక్కడ దాని పల్లి తినేస్తే ఇంత బతుకూ బతికి అనక అన్న పొట్టిపేరుతో బతకలేనని తెగించి ఒక లి దాచేసింది నా కంటపడకుండా. ఫ్రస్తుతం నా దృష్టి కుక్క్ట్ పల్లి, బోయినపల్లి, లింగంపల్లి ల మీదనుంది.
రవీ:- మీరే గనక తెనుంగుగడ్డమీదున్నట్టైతే ... ఊదం గారి ప్రశ్నకి సమాధానమివ్వండి. తెనుంగు గడ్డ అని ఎందుకన్నామో తెలుసా... కాశీ లో ముక్కుమూసుకున్న ఇంద్రసేనారెడ్డిని తొడగొట్టి పిలిచిన ఘన చరిత్ర మాది....మీదీ సీమే.. సీమ శాస్త్రి మాటల్లో చెప్పాలంటే వానప్రస్థాలూ, ఆముష్మిక ఆనందాలు మా బ్రహ్మానందం అన్నట్టు "భోషాణమేం కాదూ??".... ఇవన్నీ పక్కనపెట్టండి. మీ ఆఫీసులో మీరుపడే నరకయాతన, బాసో , బాశీశ్వరో మిమ్మల్ని పెట్టే యాతన మీతోటి సహచరులరతో మనసువిప్పి మాట్లాడుకోవాలని మీకు మాత్రం అనిపించటం లేదూ.. చెప్పండి? కనీసం కనులు కాయలుకాచేలా ఎదురుచూస్తున్న్న చిన్నారి బ్లాగ్పక్షులని చూసైనా మీ రాయలసీమ రాతి హృదయం కరగడం లేదా అని చెప్పి బల్ల గుద్ది మరీ అడుగుతున్నాను అధ్యక్షా....
సనపత్ శ్రీపతి గారు,
ReplyDeleteనిజం గానే తెలియదండీ. ఈ వ్యాఖ్యలలోనే ఒక రవి గారున్నారు. వారే అనుకుంటా. వారి బ్లాగు మరీ 'క్లోస్డ్' సర్క్యూట్ ' బ్లాగ్ లా గుంది. ఇక మా లక్కు ఇంతే అనుకుంటాం నో రీడింగు పాసిబల్!
జిలేబి.
సనత్, ఆఫీసు, బాసు గొడవ కాదండి. నా పర్సనల్ గొడవే.అది కాస్త సద్దుమణిగేంతవరకూ కవి సమ్మేళనాలు అవీ పెద్దవాళ్ళే చూసుకోవాలి.
ReplyDeleteఇక నా బ్లాగంటారా - చిరాకు పుట్టి మూశానండి. ఎవరికీ తెలీకుండా కొత్త బ్లాగు మొదలెట్టమని మా ఆవిడ సలహా. పట్టించుకోలేదు. సరే ఇప్పుడు పర్మిషన్స్ తీశాను.
హమ్మయ్య. థాంక్స్... ఎన్నాళ్ళో వేచిన ఉదయం.. ఈనాడే మొదలౌతుంటే... కొత్త బ్లాగు మొదలయ్యేవరకూనైనా కొంచం ఉపశమనం.... మొత్తానికి రాయలవారనిపించారు.. మారువేషం లో ప్రజపాలనకానిద్దాం అనుకున్నానంటారు...
ReplyDeleteజిలేబీ గారూ !!http://blaagadistaa.blogspot.in/
ReplyDeleteIf you want to understand how Ravi does compering and analysis, look at the link below.
http://poddu.net/2009/%e0%b0%a8%e0%b0%be%e0%b0%97%e0%b0%ae%e0%b1%81%e0%b0%b0%e0%b0%b3%e0%b0%bf-%e0%b0%ac%e0%b1%8d%e0%b0%b2%e0%b0%be%e0%b0%97%e0%b1%81-%e0%b0%b8%e0%b0%ae%e0%b1%80%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7/
If you are intrested in Padyam you may read the link here (kavi sammelanam which presided over) and enjoy
http://poddu.net/2011/%e0%b0%b6%e0%b0%be%e0%b0%b0%e0%b0%a6%e0%b0%be-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%9c%e0%b0%af%e0%b1%8b%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%be%e0%b0%b8%e0%b0%ae%e0%b1%81-1/
మొత్తం మీద మనసును కదిలించి బ్లాగునూ తెరిపించారుగా,
ReplyDeleteమీకు అనేకానేక ధన్యవాదాలు.
సనత్ గారూ మొత్తము మీద రవి గారిని మరల వెలుగు లోనికి తెచ్చారు. అభినందనలు.
ReplyDeleteరెండు మూడేళ్లక్రితం ఓ పొద్దు సమ్మేళనం లొ - తాడేపల్లివరూ చిరంజీవి ని గూర్చి చక్కటి చంపకమాల చెప్పారు..
ReplyDeleteమీ మొదటి పద్యం కూడా -అంతే చక్కగా - రవిగారి గూర్చినదిగానుంది..
మీరు చెప్పనిదల్లా ఒక్కటే - సంస్కృత శ్లోకపాదం తీసుకొని సమస్యాపూరణం చేసిన ఘనత.