కార్తీక మాసం ఆరంభమయ్యింది, శనివారం కదా అని మా అబ్బాయితో కూర్చుని న్యాసం చేస్తూంటే " వక్త్రే సరస్వతీ తిష్టతు, నయనయోశ్చంద్రా దిత్యౌ తిష్ఠేతాం, సర్వతో వాయుస్థిష్ఠతు" అని వినగానే వాడడిగాడు అంటే ఏమిటి నాన్నా అని (ఆ పేర్లు వాడికి కొంచం పరిచయమున్నవి అవడం తో). సరస్వతీదేవి నాలుక పైన, సూర్య చంద్రులు రెండు కళ్ళలోనూ, వాయువు అంతటా ఉన్నాడని అర్థం నాన్నా అన్నా...(వాడెక్కడ శివుడి తలమీద చంద్రుడుంటాడు కదా మళ్ళీ కళ్ళల్లో ఉండడమేమిటి అని అడిగేలోపు ఇంకేదో విషయం పైకి ధ్యాస మరల్చేశాను).
ఆ తర్వాత అదే విషయమై ఆలోచించటం మొదలెడితే ఒక ఊహ తట్టింది...
రవి యొక కంట వెల్గులిడు రాతిరి ఱేడు మరొక్క కంట నీ
భువి పయి వెల్గులీనునని పుత్రునకున్ వివరించువేళ చ
క్షువులను గీటి ఆడెనొ రఘూత్తముడున్ తన తండ్రి తోడ శై
శవమున! నాటి నుండి రవి చంద్రులకున్ గ్రహణమ్ము లొచ్చెరో !!
స్ఫుర్తి:
(1) నాగమురళి గారి ఆకాశంలో ఆంబోతు, కామేశ్వరరావుగారి దీపావళి చందమామ చదువగా ఊహలటువైపు సాగటం..
(2) మా అబ్బాయికొచ్చినట్టే సందేహాలు రాముడికీ వచ్చి ఉంటాయి, వాళ్ళ నాన్న ఒడిలో కూర్చుని ఆటలాడేటప్పుడు (అసలే ఆయనగారికా అబ్బాయంటే బహు గారాబమాయె) వాళ్ళ నాన్ని అడిగి ఉంటే ఆయన ఏమని సమాధనం చెప్పేవారో కదా అని కలిగిన ఆలోచన. కుడి కన్నుగీటగా సూర్య గ్రహణమూ, ఎడమ కన్నుగీటగా చంద్ర గ్రహణమూ అయ్యాయేమో...
మనసైనవాడు కన్నుగీటితే లభించే "కిక్కు" ను వర్ణించటం అలవిగాదు. అందులోనూ పసిపిల్లల బోసి నవ్వులు, కంటి చూపులూ.. అబ్బో మరింత ముద్దొస్తున్నట్టుంటాయి. ఆ కొంటె కనుచూపుతోనే కద బాలకృష్ణుడు కూడా గోపికలందరి మనసునూ కొల్లగొట్టింది..
కావాలంటే సంపూర్ణ సూర్య గ్రహణమప్పుడు కనిపించే గోల్డెన్ రింగు ను చూడండి...

2 comments:
అద్భుతమైన ఊహ. పద్యం చాలా బాగా వచ్చింది. చదువుతూండగా .. చక్షువులన్ అని చదివి, కన్ను కోట్టడం అంటే ఒక కన్ణే కొడతారు గదా అని అనుకున్నప్పటికీ, సూర్య చంద్రులిద్దరికీ గ్రహణాలు సంభవిస్తున్నాయి అని చెప్పడం వల్ల చక్కగా సరిపోయింది.
ఇంకో తమాషా - నేనెక్కువగా చిన్నప్పణ్ణించీ విష్ణూసహస్రనామం పరిచయం వల్ల విష్ణుమూర్తికే సూర్యచంద్రులు నేత్రాలు అనుకుంటూ ఉంటే, ఈ రుద్రప్రశ్నం పరిచయంతో శివుడికి సూర్యచంద్ర నేత్రాలతోపాటు మూడో కన్నులో అగ్నికూడా ఉన్నాడని తెలిసి ఆశ్చర్యమైంది.
కొత్తపాళి గారు, నెనర్లు.
పిల్లల ఆటలాడేటప్పుదు చేసిన పనులే మళ్ళీ మళ్ళీ చేస్తూంటారు కదా అట్లా మార్చి మార్చి కన్ను కొట్టినట్టున్నాడు అందుకే ఈ రెండు గ్రహణాలు ఒకేసారి రావు.. ;)
ఉన్మేష నిమిషోత్పన్న భువనావళి కన్నా ఈ ఆలోచనే కొంచెం ఎక్కువ సబబు గా అనిపించింది గ్రహణం కూడా చాల కొద్దిసేపే ఉంటుంది కదా.. ;)
Post a Comment