Wednesday, April 16, 2014

రాముడూ- స్ఫూర్తి - సాధించెనే !

కవిత్వం వికసించడానికి అనువైన పరిస్థితులను పెద్దన్నగారు నిరుపహతి స్థలంబు, రమణీ ప్రియదూతిక మొదలైనవన్నారు గానీ .. నా వరకు నాకు వసంతఋతువు, ఉగాది, వసంత నవరాత్రులు, రామనవమి.. రామనామం వీటిలో ఏ ఒక్కటైనా చాలు కవిత్వమూ, మంచి మంచి ఆలోచనలూ రావడానికి..  అలా వచ్చిన ఒక ఊహే.. ఈ టపా...

నవరాత్రులలో త్యాగరాజ ఘనరాగ పంచ రత్న కృతులు వింటూండగా ఒక సంశయం కలిగింది. తనలో ఏమైనా లోపముందేమో అని బాహ్య ప్రపంచములో ఉన్న మానవులు చేస్తున్న తప్పిదాలను తనకు ఆపాదించుకుని దుడుకుగల నన్నే దొర కొడుకు బ్రోచురా అని.. కీర్తన జేస్తారు త్యాగరాజ స్వామివారు.. ఆ కీర్తనలో బ్రోచేవారెవరురా అని అడగడమే గాని స్వామి వారిని రాముడు కరుణించినట్లు సొల్యూషన్ (ప్రశ్నలకు సమాధానాలు)  కనిపించదు.. మూడవదైన సాధించెనే ఓ మనసా కృతి చాలా వింతైనది. నిందా స్తుతిలో ఉన్నట్టు నిర్వచనాలున్నాయి... అసలు ఆ కృతే (సంగీత జ్ఞానం పెద్దగాలేని) నా మట్టి బుఱ్ఱకు చిత్రాతి చిత్రంగా అనిపిస్తుంది.. ఆపై ఒక ఆలోచన/ ఊహ కలిగింది.. దాని అక్షరరూపమే ఈ టపా...

Tuesday, October 15, 2013

మధుర స్మృతులు..

చిన్నప్పుడు పెద్దగా అనారోగ్యం చేసింది కూడా లేదు..కానీ ఏపాటి జ్వరం గట్రా వచ్చినా  "ఏరా ఎలా ఉంది ఒంట్లో?" ఖంగుమని కంఠం వినిపించటంతోటే అన్ని నెప్పులూ, బాధలూ హుష్కాకి అనే ఫీలింగో ఎమో ... "బావుంది మావయ్య" అని మాత్రమే సమాధనం వచ్చేది  ... ఎన్నేళ్ళైనా (9 వ తరగతికి వచ్చేవరకూ)ఇదే వరస... డాక్టరు దగ్గరకి వస్తే మనకి ఎలా ఉందో చెప్పాలన్న ధ్యాస/ ఇంగితం రెండూ లేవు.. వచ్చాం కాబట్టి తగ్గిపోతుంది, కాబట్టి ఇంక వేరే చెప్పక్కర్లెదు అనో, అమ్మా, నాన్న ప్రొద్దున ఒక కార్యక్రమానికి తీసుకెళ్తే అక్కడ కనిపించి/ సాయంత్రం మరోచోటికి వెళ్తే అక్కడ కనిపించేసరికి, మనకి ఎక్కడికెళ్ళినా ఎమైనా పర్వాలేదు, మన డాక్టరు నుండి ఎప్పుడూ దూరం లేము అన్న నిబ్బరమో, అందులోనూ మన మాస్టరుగారి ఇల్లు, సీతక్క తో స్నేహం.. అందరిలో ఆప్యాయంగా దగ్గరకి తీసుకుని ముద్దు చేసే సింగరి వదినతో చనువు కారణమో తెలీదు కానీ మాస్టరుగారి పిల్లలందరిలోకి బుజ్జి మావయ్యతో (డా. వరాహ మిహిరాచార్య)  ఒక ప్రత్యేకమైన అనుబంధం...Sunday, September 22, 2013

నివాళి...

జీవితంలో మనకు తారసపడే వ్యక్తులు - ఆవసరం కోసం కలుసుకునేవాళ్ళు కొందరైతే, అలవాటు వలన కలుసుకునేవాళ్ళు ఇంకొందరు.. జీవితం లో వీరి ప్రభావం నిజానికి అంతంతమాత్రమే... అయితే వీరికి భిన్నంగా అనుకోకుండానో, అవకాశం వల్లనో, లేకపోతే అదృష్టం కొద్దీనో కలుసుకోగలిగినవాళ్ళు ఇంకొందరుంటరు.. వారందరూ చిరస్మరణీయుల కోవకి చెందుతారు....

అట్లాంటి చిరస్మరణీయులలో ఒకరు ఆర్టిస్ట్ కరుణాకర్ !!

నా రాతలను ప్రభావితం చేసినవారిలో బోయిభీమన్నగారొకరైతే
నా గీతలను ప్రభావితం చేసినవారిలో ఆర్టిస్ట్ కరుణాకర్ ఒకరు...

అదృష్టం కొద్ది ఆయనను మళ్ళీ మళ్ళి కలిసే అవకాశం ఒకానొక అవసరం రూపంలో తటస్థించింది.. నవంబరు 2012 నుండి ఏప్రిల్ 2013 వరకూ దాదాపు నెలకొకసారైనా కలవగలిగేవాణ్ణి..