Monday, July 9, 2012

సింహావలోకనం

సింహావలోకనం, సింహావలోకనం అంటూంటాము.. అసలు తరచి చూసుకోడానికి సింహావలోకనమనే ఎందుకనాలి? జంతువులలో మిగిలిన ఆ జంతువూ వెనక్కి తిరిగి చూసుకోనే చూసుకోదా? చూసుకున్నా సింహానికున్నంత grace వాటికి ఉండదా? ఉత్తమమైన నడకని సూచించేప్పుడు సామజ వరగమనా అనీ, హంస గమనా అన్నారు కదా? సింహానికే ఎందుకంతటి grace ఉంటుందో గమనించారా? కారణమేమయ్యుంటుంది? నాకొచ్చిన చిలిపి ఊహ



శ్రీరంగంలో రంగడి కళ్ళంత అందమైన కళ్ళు చూసినతర్వాత ఒక భక్తాగ్రేసరుడికి ఇంక ఏ కళ్ళల్లోనూ అంతటి అందం లేదనిపించిందిట. అట్లే, వెనక్కి తిరిగి చూస్తే "తిప్పుకోలేనంత అందం" అంటారు కదా అది కనిపించిందట సింహానికి అమ్మవారిలో. అంతే అప్పటినుండీ ఆవిడ మోమును చూసుకుని చూసికుని మురిసి తరించిపోతోందిట సింహం అప్పటినుండే "సింహావలోకనం" ఉత్తమమైన పదప్రయోగమయ్యిందేమో..

మునులే మోమును గాంచినంత గలిగెన్ మోక్షమ్ము ! నెద్దానినిన్
అనిమేషత్వము నొంది జూతురట నింద్రాద్యష్ట దిక్పాలురున్
గనగా నెంచి తలెత్తి జూచితి ! శిరఃకంపమ్ము "సింహావలో
కనమయ్యెన్" నిల సింహవాహిని! శివా! కారుణ్యవారానిధీ !!

1 comment:

Common Man said...

నమస్కారం,

భాగవతము లోని ప్రాచేతసోపాఖ్యనము లోని రుద్రగీత ప్రతిరోజు చదవాలని నా అభిలాశ (కనీసం ఏకాదశి రోజైనా) ఇంటర్నెట్లో తెలుగు లిపిలొ రుద్రగీత నాకు దొరకలేదు. నేను తెలుగు లొ వ్రాయడానికి ప్రయత్నిస్తున్నాను కాని తప్పులు దొర్లుతాయని భయం, కష్టంగా కూడా వుంది. మీకు శ్రమ లేకపోతే తెలుగులో ఇవ్వగలరు.


I have tried to write 2 sokas in telugu, given below for your reference:

నమః పంకజ-నాభాయ
భూత-సూక్ష్మెన్ద్రియత్మనే
వాసుదేవాయ శాంతాయ
కూతస్తాయ స్వ-రోచిషే

సంకర్షనాయ సుక్ష్మాయ
దురంతయంతకాయ చ
నమో విశ్వ-ప్రభాదాయ
ప్రద్యుమ్నాయన్తరాత్మనే

dhanyavadaalu,