Saturday, July 18, 2009

మా ఇంటి బుడుగోపాఖ్యానం ..

శనివారం వస్తే ఏదో ఒక పుస్తకాన్ని ముందేసుకు కాలక్షేపం చేయటం నాకున్న దురలవాట్లలో ఒకటి. (మిగిలిన రోజుల్లో హడావుడి పరుగులే కదా..)
నా మటుక్కు నేను ఏదో లోకంలో ఉన్నట్టు ఉంటే, మా ఆవిడ మావాడితో కుస్తీలు పడుతూ ఉంటుంది. ఏదో పాటలూ, పద్యాలూ గట్రా నేర్పిద్దాం అని. మధ్య మధ్యలో నాకు రెండు తగిలిస్తూంటుంది, వాడిచ్చే సమాధానాలకి. వెధవకి రెండేళ్ళు కూడాలేవు షోకులూ, టెక్కులూ తక్కువేం లేదు.

ఇంతకీ ఇవ్వాళ మా శ్రీమతీ వాళ్ళ చెల్లయి లండన్ నుంచి వచ్చింది. చూసి రెండేల్లైపోయింది కదా అని వాడితోనే రెండ్రోజులు గడపాలని మా ఇంటికి వచ్చింది.
ఆ అమ్మాయి అదృష్టం కొద్దీ పిల్లవాడికి పద్యాలు నేర్పిస్తున్నప్పుడు వచ్చింది. వాణ్ణి పిన్నిదగ్గర నేర్చుకో అని చెప్పి మా ఆవిడ వంటిట్లోకెళ్ళింది ఫలహారాలకనుకుంట. మా వాడేమైనా శ్రధ్దగా కూర్చుని పాఠాలు నేర్చుకుంటున్నాడా అంటే, , చెవుల్లో ఇయర్ ఫోను పెట్టుకుని ఎంపి3 ప్లేయర్ తో, కళ్ళజోడుతో హాయి గా సోఫాలో కాళ్ళు ఇరగదన్ని ఠీవీగా పడుకుని ఉన్నాడు.

వస్తూనే అంది, "మీవాణ్ణి మరీ తలకెక్కించుకుంటున్నారేమొనేవ్.." అని... చురుక్కు మని వీపు మీద ఏదో చిన్న మంటలా అనిపిస్తే తలతిప్పి చూసా.. వంటింట్లోంచి మా ఆవిడ చూపులు అవి, (నా నిర్వాకమే అన్నట్టు). నేనూర్కుంటానా.. స్నానానికని పైన వేసుకున్న తువ్వాలు భుజం మార్చుకున్నా...సింపులూ...

"ఏం పద్యం నేర్చుకుంటున్నావ్ రా..." అడిగింది

మావాడు నాలానే ఏదో ధ్యాస లో ఉన్నవాడి లా అన్నడు "టమేవ మాటా" (ట అన్నడు త అనకుండా) ముందు అర్ధం కాలే ఆ అమ్మయి కి , తర్వాత అర్ధం అయ్యింది త్వమేవ మాతాచ అని.

"సరే చెప్తే నేర్చుకుంటావా? వేషాలు వేస్తావా?" అడిగింది..."ఊ " అని బుర్ర ఊపాడు. మొదలెట్టింది చిన్న చిన్న పదాలతో నేర్పించటం ..వాడూ పరధ్యానం లో ఉన్నట్టుగానే ఉంటూనే చెప్ప్తున్నాడు.

అప్పుడు జరిగిందీ సంగతి. నేర్పిస్తున్న పద్యం మధ్యలో వాడికి బోల్డన్ని ప్రశ్నలొస్తూంటాయి. అది తీరితే కానీ నడక ముందుకు సాగదు. (అదేదో వ్యాసుడూ, గణపతీ ఒప్పందం చేసుకున్నట్టు.. అర్ధం అయితే తప్ప ముందు కి బండి సాగనివ్వడు మావాడు... నాకూ అది అప్పుడే అర్ధం అయ్యిందనుకోండి.) మా ఆవిడ నాకు టిఫిను అందిస్తూంటే వాడు ఆ అమ్మాయిని అడిగాడు "ద్రవిణం" అంటే ఏమిటి అని. ముందు మా ఆవిడ, ఆతర్వత నేనూ ఆల్మోస్టు ఒకేసారి ఖంగు తిన్నాం (ఒక్క లిప్త కాలం ఒకర్నొకరు హాస్చర్యం గా చూసుకున్నాం కదా..)

నేను బుర్రతిప్పకపోయినా చెవులు రిక్కించి వింటున్నా.. రియాక్షన్ ఎలా ఉంటుందా అని. కొంచం ఇరకాటం గానే అనిపించింది కాబోలు ఆ అమ్మాయికి "ఏమిరా.. నీకు ద్రవిణం కావాల్సి వచ్చిందే.. ఆకాటికి మిగిలినవన్నీ తెలిసిపోయినట్టె.. దాని మీనింగు తెలుసేమిట్రా అంది."

వాడు ఠక్కున ఎత్తుకున్నాడు అదే పరధ్యానం తో "నీవే టల్లివి టండ్రివి నీవేనా టోడు నీడ నీవే సఖుడౌ, నీవే గురుడవు దైవము నీవే నా పటియు గటియు నిజముగ కిత్నా"

ఈ సారి అవాక్కవడం ఆ అమ్మాయి వంతయ్యింది, నవ్వుకోవడం మావంతూనూ. మా వాడీకీ ఏదో అర్ధమైనట్టే ఉందనుకుంట, కొంటె గా నవ్వేసాడు.

వాళ్ల అమ్మ నేర్పించిన అదేదో పద్యానికీ దీనికీ లింకు ఎలా పెట్టగలిగాడు అన్నది మాకు ఇప్పటికీ మిలియన్ డాలరు ప్రశ్నే..
అప్పుడప్పుడు డౌటొస్తూంటుంది ముళ్ళపూడి గారి బుడుగు దారి తప్పి మా ఇంట్లోకి గానీ వచ్చేశాడేమో అని...

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
ఇది జరిగి 8-9 నెలలుథోంది....పాతఫొటో లు ఎదో దులుపుతూంటే స్మృతిపథం లో ఈ సంఘటన బయటపడింది.

12 comments:

Anonymous said...

బుడుక్కాదు, పిడుగే. సూపర్.

durgeswara said...

mIvaaDu piDugE

రవి said...

మీ బుడుగు "ట" వర్గీయుడన్నమాట. మా బుడుగి "త" వర్గంలో ఉంది ఇప్పుడు. 11 నెలలు.

చిలమకూరు విజయమోహన్ said...

"బాలవాక్కు బ్రహ్మ వాక్క"న్నారు.
గీతలో అన్నాడు కదా కిత్న పరమాత్ముడు "సర్వస్య చాహం హృది సన్నివిష్టః " గీత 15 అ 15 శ్లో.
సర్వ ప్రాణుల హృదయాలలోవున్న నా వల్లనే జ్ఞాపకం, జ్ఞానం, మరపు కలుగుతాయి.
కాబట్టి మీ వాడిలో ఉన్న ఆయనే మీ సందేహాన్ని అలా నివృత్తి చేసాడు. :)

కొత్త పాళీ said...

absolutely adorable and absolutely fantastic.

Sanath Sripathi said...

మురళీ, దుర్గేశ్వరగారూ, రవిగారు, విజయమోహన్‌గారూ, కొత్తపాళీగారూ ధన్యవాదాలు.

Tingu said...

Adbhutam mee Vaadu Appude Ubhaya Bhasha PraveeNuDannaMaata... Sabhaash

Masterminds said...

Ninna raatri oka kotta shock ichchaadu...

sumaaru 11 PM avutondi... Krishna Sanandan naa vallo padukuni gaaralu potunnadu...

intalo oka maata vinna "Bore Kodutondeeeeee ..."

Sanathooo nenoooo oka levello mohalu choosukunnamu... veedu kallu nalupukuntoo kontega oka navvu navvadu...

Sujata M said...

చాలా బావున్నాడు మీ కిట్నుడు ! టెలివైనవాడు కూడా !

Unknown said...

bagundhi mee vadi padyamu..... naku phone chesthe aa prasna endhuku adigado chebutha.....

Lavanya said...

Chalaa baagundi

Sanath Sripathi said...

@టింగు గారూ, ఉభయ భాషా ప్రవీణ సంగతేమో గానీ మాకు మాత్రం ఉభయ చెవులూ 'కీ' లౌతాయేమో అని డౌటు.

@కిషోర్,@సుజాత,@ నాని, @శ్రీవల్లి, @రాఘవ ధన్యవాదాలండీ.