హనుమజ్జయంతి సందర్భం గా....నన్ను బాగా కదిలించే పద్యాలు .. ఓ మూడు ఇక్కడ...
డాసిన చుట్టమా శబరి? దాని దయామతి నేలినావు; నీ
దాసుల దాసుడా గుహుడు? తావక దాస్యమొసంగినావు; నే
జేసిన పాపమా? వినుతి సేసినఁ గావవు! గావుమయ్య! నీ
దాసులలోన నేనొకడ దాశరథీ! కరుణాపయోనిధీ!
పెంపున దల్లివై, కలుషబృంద సమాగమ మొందకుండ ర
క్షింపను దండ్రివై, మెయి వసించు దశేంద్రియ రోగముల్ నివా
రింపను వెజ్జవై కృప గురించి పరంబు తిరంబుగాగ స
త్సంపదలియ్య నీవె గతి దాశరథీ! కరుణాపయోనిధీ!
సిరులిడ సీత, పీడ లెగఁజిమ్ముటకున్ హనుమంతు, డార్తి పోఁ
దరుమ సుమిత్రసూతి, దురితంబులు మానుప రామనామమున్
గరుణ దలిర్ప, మానవులఁ గావగఁ బన్నిన వజ్రపంజరో
త్కరముగదా భవన్మహిమ! దాశరథీ! కరుణాపయోనిధీ!
పద్యాలు రాసే ప్రారంభదశలో (యతి, ప్రాసలపై ధ్యాసేలేని పాతరోజుల్లో) ఒకానొక రోజు రాసుకున్న పద్యం...
హృదయము నందు మిమ్ము గొనినంతనె మారుతి ఆఢ్యుడయ్యెనా?
విదితము గాదె? రామ ! తమ గేహము సేసితి నాదు ఆత్మనున్

ముదమున; గాని ఆత్మ దరి జేరెడి మార్గము మర్చిపోతి; శ్రీ
మదఖిల లోక పాలక సమస్తము జూపెద ! దారి జూపినన్ !!
స్ఫూర్తి:- కారుణ్యతః కల్పయ పద్మవాసే లీలాగృహం మే "ఆత్మారవిందం" అనుకుంటూ నా ఆత్మని మీ ఇంటిగా తీర్చిదిద్దా... పెద్దవాళ్లైన మిమ్మల్ని ఇంట్లో పెట్టి, పిల్లాణ్ణైన నేను బయటెక్కడో తప్పిపోయా... తిరిగి ఇల్లెలా చేరుకోవాలో తెలీటం లేదు....రామా.. ఆత్మని ఎలా చేరుకోవాలో దయచేసి చెప్పవా? అక్కడ నిన్నే కాదు సమస్తాన్నీ చూపించకపోతే అప్పుడు అడుగు అని నా ని'వేదన' !! (నువ్వుంటే సమస్తమూ ఉన్నట్టె కదా...)
ఏ మార్గమైనా/ ఏ గురు సాంప్రదాయమైనా ఆత్మని తెలుసుకో, నీవెవరో తెలుసుకో అనే అంటుంది కదా... ఆత్మని తెలుసుకుంటే సమస్తమూ తెలిసినట్టే, ఆత్మారాముణ్ణి తెలుసుకున్నా సమస్తమూ తెలిసినట్టే అనే భావన ఆలంబనగా...
రామార్పణం...

3 comments:
మంచి పోస్ట్
ఆత్మని రాముని యిల్లుగా చేసి ఆ ఆత్మకి దారి మరిచిపోవడం - చాలా బాగుంది భావన! పోని ఆ ఇంటికి ఫోన్ నెంబరేమైనా ఉందేమో చూడండి, మీ రామునికి ఫోన్ చేసి దారి తెలుసుకోవచ్చు. :-)
ధన్యవాదాలు దుర్గేశ్వరా, కామేశ్వరరావు గారు !
ఫోనుంది గానీ నంబరు తెలీదే...
- సనత్
Post a Comment