Tuesday, April 6, 2010

రేఖా విలాసం


నేనేసిన బొమ్మల్లో ఇదోటి.

దీన్లో ప్రత్యేకతలేమిటో ఎవరైనా చెప్పగలరా?

(దీని మాతృకతో పాటు, దీని వెనకున్న కథా కమామిషు వివరాలు తర్వాత టపాలో ..)

8 comments:

మాగంటి వంశీ మోహన్ said...

శ్రీమన్నారాయణుడు బ్రహ్మాండం.....అద్భుతం...ఆవిడలో కళ కొద్దిగా తగ్గింది...మాతృక, కథా అన్నీ బొమ్మే చెప్పేస్తోందిగా...చెప్పనఖ్ఖరలా.. :)

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

చాలా బాగుంది. సముద్ర తనయ అనంత శయనుని వరించుట!!

రవి said...

వావ్! మాటల్లేవు!

Ravi Harsha said...

ప్రత్యేకత అంటే, వెనుక ఇండియా మ్యాప్ లా ఉంది.

Ravi said...

చాలా బాగుంది.

Sanath Sripathi said...

కామెంటిన అందరికీ ధన్యవాదాలు.

ఈ బొమ్మలో ప్రత్యేకత అని నేను భావించి గీసినది... అలలూ, రాక్షసులూ, దేవతలూ, వాసుకీ, పద్మమూ, పద్మం రేకులూ, స్వామివారి చేలాంచలమూ, అమ్మవారి పట్టుకోకా, వారిద్దరి శిరోజాలూ, వెనకనున్న ఆకాశమూ, గాలీ అన్ని కూడా అనంతం లోనుంచి ఏర్పడుతున్నవే .. ఏవీ కూడా పరిమితులున్నవి కావు... గమనించే ఉంటారు.

విశ్వం విష్ణుః కదా... అన్నీ ఆయనే, అంతా ఆయనే -- ఆ అనంత జలాల్లోనుంచి పంచభూతాలూ, సృష్ట్యాది రూపుకట్టుకుంటున్నట్టు గా భావనతో వేశా.

"క్షీర సాగర విహారా.. అపరిమిత ఘోర పాతక విదూరా" లో "అపరిమిత" నుండీ స్ఫుర్తి పొంది వేసిన చిత్రం ఇది.

వంశీ గారూ !!
ఆవిడలో కళ కొద్దిగా తగ్గిందంటారా? అది చిన్న సైజు చేయటం వల్ల అనిపిస్తొందా ఏమైనా?

మాగంటి వంశీ మోహన్ said...

కాదండీ...చిన్నగా చెయ్యటంవల్ల కాదు....నా కళ్ళకే అలా కనపడుతోందో తెలియదు కానీ.....నా మటుకు - ఆయన్ని చూడగానే, ఆ సుందర వదనారవిందాన్ని చూడగానే - అద్భుతమనిపించింది....ఒక్కసారిగా మనసు ప్రశాంతమైపోయింది, ఆవిడ మొహంలో ఆ ఇది కనపడలా....

ఎక్కడో కొద్దిగా తేడా వున్నది...
1)చుబుకం వద్ద,
2)కంఠం కలిసేచోట
- ఆ ప్రాంతాల్లో - గీయటంలో ఏదో తేడా వచ్చిందని నా అనుమానం ...... NOT to be Nitpicky :) ఇంకో చిన్న ప్రశ్న - ఆయన చుబుకం దగ్గర నలుపు కావాలని చొప్పించారా? అసంకల్పితమా?!

నాలుగు చేతులతో గొప్ప సౌలభ్యం ఉందండీ! ముందు రెండు చేతులతో మాలను పట్టుకున్నా, మూడో చెయ్యి - కాబోయే "హజ్బెండు" చేతిలో పెట్టేసింది ఆవిడ... :)

Sanath Sripathi said...

పాణి గ్రహణం అంటే అదే కదా మరి..