Wednesday, July 7, 2010

మాగాయ్ పచ్చడి...

నేపధ్యం:

కంది శంకరయ్యగారు ఒక సమస్య ని ఇచ్చారు

నా పద్యం:

వెచ్చని గాడ్పుల వేసవి
వచ్చిన సడి తెలియునట్లు వడ్డించండోయ్
నచ్చిన ముక్కల మాగాయ్
పచ్చడి మెతుకులె మన కిఁక పరమాన్న మయెన్

స్ఫూర్తి :
మాగాయొక మహా పచ్చడి పెరుగేస్తే మహత్తరి, అది వేస్తే అడ్డవిస్తరీ మానిన్యాం మహాసుందరీ అన్నారు కదండీ.. అందుకే..

3 comments:

రవి said...

:-) :-)కొత్తావకాయ్ పచ్చడిలా ఘుమఘుమలాడింది మీ కవిత.

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

పద్యం బాగుంది.
భావానికి, సందర్భానికీ పరమాన్నం కన్నా విందు భోజనం లాంటి పదం అయితే సరిపోయేదనిపించింది.
ఏమనుకోకండి ఇలా చెప్పానని.

Sanath Sripathi said...

రవీ, మందాకినిగారు! ధన్యవాదాలు.