Sunday, June 13, 2010

పులి మానసం

రామాయణ కథనంతా చిత్రకారులు చిత్రీకరిస్తే రాముడూ, సీతాదేవీ వాటిని గమనిస్తూ అప్పటి రోజులని గుర్తు చేసుకుంటూ మాట్లాడుకున్నారు అని భవభూతి ఉత్తర రామచరితం లో వర్ణిస్తారు. అదేభావనతో ఈ పద్యం..

వేటగాళ్ళ క్రూరత్వానికి పులులు బలై పొతూంటే పులి పిల్లలు అనాథలైపోతున్నాయి. అట్లాంటి ఒక అనాథ పులిపిల్ల తన గతాన్ని, తన తల్లితో ముడిపడి ఉన్న మధురమైన జ్ఞాపకాలనూ నెమరువేసుకుంటూంటే ఎలా ఉంటుందో అని ఆలోచనకి ఇది పద్య రూపం..




ఆవల ఈవలంచు తిరుగాడెడి పిల్లల నెల్ల ప్రేమతో
కావలి గాచి సొక్కితివొ, కంటికి నిద్దుర దూరమయ్యెనో?
త్రోవల తూలినావు ! కనుదోయిని నా మునివేళ్ళ విప్పనా?
దేవుని పైన భారమిడి ఈ సమిధన్ చెవి దూర్చి చూడనా?
ఈ వనమందు నీవు శయనింపగ లేపెడి ధూర్తు నేనె గా....

1 comment:

రవి said...

పంచతంత్రంలో పులి కంకణం కథలో పులి మాట్లాడుతుంది. ఆ తరువాత పులి మాటలాడ్డం,జ్ఞాపకాలను చెప్పుకోవడం ఎలా ఉంటుందో ఇప్పుడే చూస్తున్నానండి.

కడుంగడు హృద్యముగనున్నది.