వాక్కులో, వాక్యంలో, శబ్దంలో, సమాసంలో, భావంలో, భావనంలో, దర్శనంలో, విమర్శనంలో, భాషణంలో, భూషణంలో ఒక వైలక్ష్యం వెల్లివిరిసేట్టు గా రచించిన మహా కవి 20 వ శతాబ్దములోని ఆంధ్ర సాహిత్యమునకు, ప్రత్యేకించి సంప్రదాయ సాహిత్యమునకు పెద్ద దిక్కు; "కవి సమ్రాట్" బిరుదాంకితుడు, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత - శ్రీ విశ్వనాథ సత్యనారాయణ.
ఆయన చేపట్టని సాహిత్య ప్రక్రియ లేదు.- కావ్యములు, కవితలు, నవలలు, నాటకములు, ప్రయోగములు, విమర్శలు, వ్యాసములు, కథలు, చరిత్రలు - ఆయన పాండిత్యము, ప్రతిభలు జగమెరిగినవి. ఆయన మాటలలోనే "నేను వ్రాసిన పద్యముల సంఖ్య , ప్రకటింప బడినవాని సంఖ్య, సుమారు ఇరువది వేలుండ వచ్చును. నేను చింపివేసినవి ఏబది వేలుండవచ్చును " . ఆయన రాసిన రచనలన్నీ కలిపితే లక్షపుటలుండవచ్చును అటువంటి విశ్వనాథ వారి సమగ్ర సాహిత్య గ్రంథావళిని విశ్వనాథ వారి మనుమడు, విశ్వనాథ పావని శాస్త్రి గారి అబ్బాయి - విశ్వనాథ సత్యనారాయణ (బహుశా జూనియర్ అనాలేమో) పునర్ముద్రణ గావించారు.
మంచి కాగితం పై మంచి ముద్రణతో పుస్తాకాలు అందుబాటులోకి వచ్చాయి.
(1) నవలలు - 57 పుస్తకాలు --> 4500/-
(2) నాటకములు - 16 పుస్తకాలు --> 666/-
(3) విమర్శ గ్రంథాలు - 11 పుస్తకాలు --> 1116/-
(4) పద్యకావ్యాలు (రామాయణ కల్పవృక్షం తో కలిపి) --> 1500/-
(5) పాటలు, ఇతరములు (కిన్నెరసాని పాటలు మొ||) --> 500/-
వెరసి మొత్తం 118 పుస్తకాలు 8282/- రూపాయలు.
డిస్కౌంటు పోనూ 7500/-
కవిసామ్రాట్ విశ్వనాథవారి అమూల్యమైన 118 పుస్తకములను కేవలం 7500/- రూపాయలకు కొనుగోలు చేసుకుని ఇంటినీ, మన తెలుగు అభిరుచినీ, సాహిత్య పిపాసనూ కూడా పరి పుష్టి చేసుకోవచ్చును.
ప్రతులకు : జూనియర్ వి.స.నా. ఫోన్ నంబర్ : 9246100751 (లేదా) నవోదయ పబ్లిషర్స్ : 9247471362
....ఆలస్యం అమృతం విషం ....
త్వర పడండి
4 comments:
సనత్
సమాచారానికి ధన్యవాదాలు.....మీరు కొన్నారా? ఒకవేళ కొని వుంటే పుస్తకాల్లో ముద్రారాక్షసాల శాతం తెలియచెయ్యగలరు.....క్రిందటిసారి, అనగా ఒక నాలుగేళ్ళ క్రితం ఇలాటి సెట్టు ఒక ఐదువేలు పెట్టి కొని , విశ్వనాథ వారు క్షమింతురు గాక....- ఆ తప్పులు చదివే ఓపిక లేక, భరించలేక అన్నీ చిత్తుకాగితాల్లో పడవెయ్యవలసి వచ్చింది.......
వంశీ గారూ , నేనింకా కొనలేదు. రేపెళ్ళి కొనబోతున్నా.
మీరు చెప్పేవి నవలల గురించా? పద్య కావ్యాల గురించా? నా వద్ద నవలలు ఒక 10-12 ఉండేవి (చాలా పాతవి)చిన్నప్పుడు చదివాను అవి బానే ఉన్నట్టు గుర్తు. ముద్రా రాక్షసాలు గుర్తులేవు. ఏవి ఏమైనా చూసి, చదివి చెపగలను (అన్నీ చదివేసరికి ఎంత కాలం పడుతుందో అప్పటికింకెంత రేటౌతుందో)...
@వంశీ, నిజమా?
నేను నవలల సెట్టు కొన్నాను. అందులో కనీసం ఒక పదన్నా చదివాను. తప్పులు ఎక్కువ లేవే? ఇవి ఆకుపచ్చ అట్టతో మద్రితమైన సెట్టేనా?
వంశీ గారూ !! నేను నవలలు ఇంకా కొనలేదు. విమర్శలూ, నాటకాలూ కొన్నా. అవి బానే ఉన్నాయి. కల్పవృక్షం ప్రింటు మాత్రం దగ్గర దగ్గర గా ఉంది. ప్రింటు కూడా అక్కడక్కడ blur అయినట్టుంది. (ముద్రా రాక్షసాల సంగతి ఇంకా తెలీదు)
Post a Comment