Saturday, February 14, 2009

సౌందర్య లహరి - స్ఫూర్తి -2

శ్లోకం.
అవిద్యానాం అంతస్తిమిర మిహిర ద్వీప నగరీ
జడానాం చైతన్య స్తబక మకరంద శృతిఝరీ
దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మ జలధౌ
నిమగ్నానాం దంష్ఠ్రా మురరిపు వారాహస్య భవతి !!

పద్యం.
అరిషడ్వర్గ మదాంధకారమును పారంద్రోలు మార్తాండమున్
పరమున్ జూచు అచేతనాళికి మరందానంద నిష్యందమున్
శరణున్ గోరు భవాబ్ధి మగ్న జనునుధ్ధారించు దంష్ఠ్రంబునౌ
వరలక్ష్మీప్రద పాదరేణువులు చింతల్దీర్చి సౌఖ్యమ్మిడున్ !!

2 comments:

Anonymous said...

Hey, Sanath! I did not realize it was your blog. What a surprise!!!

Sorry for my lazy eye. I did not check the details fully though read some of the blog posts and posted a comment earlier.

Sanath Sripathi said...

హాయ్ మురళి !!

కొత్త బిచ్చగాడు పొద్దెరుగడన్నట్టు పోస్టు మీద పోస్టు రాస్తూ, నేను కూడా గమనించ లేదు నాగమురళీస్ బ్లాగు అని ఉంటె అది నీదే అని. నీ బ్లాగు సమీక్ష బ్లాగడిస్తా గారు చాల బాగా రాశారు. భావాలకీ, నీకూ అక్షరాలా దర్పణం పట్టేట్టు గా ఉంది. చల్లాగారి తో మధుర క్షణాలు కూడా మైమరపించేట్టు గా ఉన్నాయి.

మీ నాన్న గారి శైలి అక్కడక్కడ ప్రస్ఫుటం గా కనిపిస్తోంది. నీ టపాలు చాలా బాగున్నాయి.
- సనత్