Showing posts with label అవధానం. Show all posts
Showing posts with label అవధానం. Show all posts

Thursday, January 14, 2010

గరికపాటి వారి సంక్రాంతి వర్ణన

గరికపాటి వారి వివిధ అవధాన వేళల్లో సంక్రాంతి వర్ణన

సంక్రాంతి
మింటను క్షీర సాగరము మేలుగ దర్శన మిచ్చుచుండు, ఇం
టింటికి భూమి నవ్వునదె, ఇంతుల ముగ్గుల రూపమంది, వం
టింటి హడావుడుల్ రసన నెంతొ రసార్ద్రము చేసె, రంగనిన్
పంటను నొక్కి పాడు హరిభక్తుడు పౌషపు వేళలందునన్..

గొబ్బిళ్ళ వర్ణన (మత్తకోకిల)
గొబ్బి పూవులు కన్నె కన్నుల కోర్కెలై విరబూయగా
నిబ్బరంబున గన్నెలెల్లరు నిత్య పూజలు సేయగా
గొబ్బి పాటలు పాపనోటికి గోరుముద్దల తీరుగా
నబ్బురంబగు సంబరంబిది అంబరంబులనంటెడిన్

సంక్రాంతి శుభాకాంక్షలు.

Friday, January 8, 2010

గరికపాటి వారి చెణుకులు -1

గరికపాటి 75 పద్యాలను అలవోకగా ధారణ చేశారని భైరవభట్ల కామేశ్వర రావు గారు రాశారు.

సముద్రాన్ని దాటిన వాడికి పిల్ల కాలువ ఒక లెక్కా అన్నట్టు సహస్రావధాన సమయంలో 750 పద్యాలను అలవోకగా ధారణ పట్టగలిగిన వ్యక్తి కి 75 ఒక లెక్కా??

కాకినాడ సాగరతీరం లో సహస్రావధానం చేశారు గరికపాటి. అందులో అద్భుతమైన వర్ణనలూ, దత్తపదులూ, సమస్యలూ, ఆశువులూ.... ముత్యాలు మచ్చుక్కి కొన్ని (ఔత్సాహికులకి ప్రోత్సాహం గా ఉంటుందని సమస్యలకి పూరణలు ఇవ్వట్లేదు)

క్లిష్టమైనవి
(1)జానేదో సినిమాకు లాలు బహు పూజ్యంబౌ మునీశాళికిన్
(2)కలరా రోగములున్న రాఘవుడు లంకంజేరె శతృఘ్నుతో
(3)మానము లేని స్త్రీని గని మాతగ మ్రొక్కిరి పండితోత్తముల్
(4)మన భార్య ఈమె, మనకమ్మయొ, అక్కయొ గావలెన్ జుమీ
(5)బూతుకు బూతు బూతునకు బూతుకు బూతుకు బూతు బూతుకున్
(6)సీతా! రామునికిట్లొనర్తువటవే సీ! ద్రోహమిల్లాలివై

సరసమైనవి
(7)పతి జూచిన పడతి గుండె భగ్గున మండెన్
(8)దున్నను గని కన్ను గీటె తొయ్యలి యహహా

దుష్కర ప్రాస
(9) రాష్ట్రమునేలగా నొక విరాధుడు రావలె రక్తపాయియై

ఇంకెందుకాలస్యం...? కానిచ్చెయ్యండి